Keerthi
ఇటీవల కాలంలో పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ లు పర్యావరణాన్ని అపశుభ్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా ప్రముఖ పర్యాటక ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో హైకోర్టు కీలక ప్రకటనలను చేసింది. ఇక నుంచి ఆ ప్రాంతానికి వెళ్లిన టూరిస్టులకు కచ్చితంగా చేతిలో డెస్టిబిన్ ఉండాల్సిందేనని కీలక ఆదేశాలను జారి చేసింది. ఇంతకి ఎక్కడంటే..
ఇటీవల కాలంలో పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ లు పర్యావరణాన్ని అపశుభ్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తాజాగా ప్రముఖ పర్యాటక ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో హైకోర్టు కీలక ప్రకటనలను చేసింది. ఇక నుంచి ఆ ప్రాంతానికి వెళ్లిన టూరిస్టులకు కచ్చితంగా చేతిలో డెస్టిబిన్ ఉండాల్సిందేనని కీలక ఆదేశాలను జారి చేసింది. ఇంతకి ఎక్కడంటే..
Keerthi
భారత దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయిన సరే అక్కడక్కడ ప్రభుత్వం తీసుకుంటుటన్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు అనేవి ఆచరణలో ఉండటమే తప్ప ఎవ్వరూ పాటించడం లేదు. దీంతో పర్యావరణం కాపాడుకునే విషయంలో ఇప్పటికి ఆశించి దగ్గ ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి.ముఖ్యంగా కొన్ని పర్యాటక ప్రదేశాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటున్నాయి. టూరిస్ట్ లు కూడా పర్యాటక ప్రదేశాలకు వెళ్లి మరింత అపశుభ్రం చేస్తున్నారు. ఎవ్వరూ కూడా కనీస శుభ్రతను పాటించకుండా.. ఎక్కడపడితే అక్కడప్లాస్టిక్ కవర్స్, వాటర్ బాటిల్స్, చెత్త చెదరలతో నేలను నింపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ పర్యాటక ప్రసిద్ధి చెందిన రాష్ట్రంలో హైకోర్టు కీలక ప్రకటనలను చేసింది. ఇక నుంచి ఆ ప్రాంతానికి వెళ్లిన టూరిస్టులకు కచ్చితంగా చేతిలో అవి ఉండాల్సిందే. ఇంతకి ఎక్కడంటే..
పర్యావరణ పరిరక్షణను కాపాడుకోవాలనే ఉద్దేశంతో.. ప్రముఖ పర్యాటక రాష్ట్రామైన హిమచల్ ప్రదేశ్ లోని హైకోర్టు కీలక సూచన చేసింది. ఇక నుంచి తమ రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు తమ వెంట డస్ట్‌బిన్, చెత్త నింపే కవర్లను కచ్చితంగా తెచ్చుకోనేలా చూడాలని ప్రభుత్వంకు సూచించింది. ఎందుకంటే.. పర్యాటకులు కారణంగా..రాష్ట్రంలో ఉత్పన్మయ్యే వ్యర్థాలను నివారించే బాధ్యతలను భాగస్వామ్యపక్షాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాంలో పర్యావరణ సమస్యల విషయంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా.. జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్, జస్టిస్ సుశీల్ కుక్రేజాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు వెలువరించింది.
ఈ సందర్భంగా.. సుస్థిర పర్యటకాన్ని ప్రోత్సహించడానికి గోవా, సిక్కిం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని హిమాచల్ సర్కారుకు సూచించింది. ముఖ్యంగా అక్కడ చెత్తవేసే కవర్లు తీసుకురావడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ఛార్జీల తీరుతెన్నులను కూడా పరిశీలించాలని వెల్లడించింది. అలాగే పర్యటకులు ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించాలని, ఆ లక్ష్యాలను చేరువడంలో భాగస్వామ్యపక్షాలు పాల్గొనేలా చూడాలని పేర్కొంది. అయితే ఇందుకోసం సిక్కిం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి ఆ రాష్ట్రానికి వచ్చే పర్యాటక వాహనాలు తప్పనిసరిగా చెత్త సంచి కలిగి ఉండాలనే నిబంధన జారీ చేసింది. ఇక పర్యాటకుల వల్ల ఉత్పన్నమయ్యే వ్యర్థాలను నిర్దేశిత ప్రాంతాల్లో పారవేయడం వంటి బాధ్యతలను సంబంధిత టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, వాహన డ్రైవర్లకు అప్పగించాలని ధర్మసనంలో ఇటీవలే జారీ చేసిన ఉత్తర్వ్యుల్లో పేర్కొంది. దీంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలను సూచించింది.