iDreamPost
android-app
ios-app

విడాకుల కేసు.. నెలకు రూ.6 లక్షల మెయింటెనెన్స్ అడిగిన భార్య! జడ్జ్‌ ఏమన్నారంటే..?

  • Published Aug 22, 2024 | 12:13 PM Updated Updated Aug 22, 2024 | 7:29 PM

Karnataka Divorce Case 6 Lakhs Maintance: విడాకుల కేసులో ఓ మహిళ నెలకు ఏకంగా రూ.6 లక్షలకు పైగా మెయింటెనెన్స్  కావాలని కోరింది. దానికి జడ్జ్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Karnataka Divorce Case 6 Lakhs Maintance: విడాకుల కేసులో ఓ మహిళ నెలకు ఏకంగా రూ.6 లక్షలకు పైగా మెయింటెనెన్స్  కావాలని కోరింది. దానికి జడ్జ్‌ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Aug 22, 2024 | 12:13 PMUpdated Aug 22, 2024 | 7:29 PM
విడాకుల కేసు.. నెలకు రూ.6 లక్షల మెయింటెనెన్స్ అడిగిన భార్య! జడ్జ్‌ ఏమన్నారంటే..?

విడాకుల కేసు కోర్టులో నడుస్తుంటే.. భర్తపై ఆధారపడిన భార్యకు మెయింటెనెన్స్  ఇవ్వాల్సిందిగా కోర్టు భర్తకు ఆదేశిస్తుంది. అలాగే ఆర్థికంగా భార్యపై ఆధారపడే భర్త కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు. చట్టంలో ఉన్న ఈ వెసులుబాటును తాజాగా ఓ మహిళ కాస్త ఎక్కువగా వాడుకోవాలని అనుకుందేమో కానీ.. తనకు నెలకు రూ.6,16,300 మెయింటెనెన్స్  భర్త నుంచి ఇప్పించాలంటూ కోర్టును కోరింది. అంత మెయింటెనెన్స్  చూసి.. ఏకంగా న్యాయమూర్తి షాక్‌ అయ్యారు. ఈ ఘటన కర్ణాటక హైకోర్టులో చోటు చేసుకుంది.

సదురు మహిళ తరపున న్యాయవాదికి.. ఈ మెయింటెనెన్స్  విషయంలో వార్నింగ్‌ ఇచ్చారు జడ్జ్‌. ‘మీ క్లయిట్‌కు మీరైనా చెప్పండి.. మరీ నెలకు రూ.6,16,300 మెయింటెనెన్స్  ఏంటీ? అయినా నెలకు ఒక వ్యక్తి అంత ఖర్చు చేస్తారా? అంత కావాలంటే ఆమెనే సంపాదించుకోమనండి.. భర్తపై భారం మోపడం కాదు. అయినా.. సెక్షన్‌ 24 లక్ష్యం అది కాదు. చట్టం ఉంది కదా అని.. ఇష్టం వచ్చినట్లు మెయింటెనెన్స్  కొరడం సరికాదని జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఇష్టమొచ్చినంత కోరితే.. కోర్టు అందులో ఎంతో కొంత ఇప్పిస్తుందని, అడగొద్దని, కాస్త న్యాయబద్ధంగా కోరాలంటూ సూచించారు.

సెక్షన్‌ 24 ఏం చెబుతోంది..?
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్‌ 24 ప్రకారం.. వివాహం తర్వాత.. ఏ జంట అయినా విడాకుల కోసం అప్లైయ్‌ చేసుకుంటే.. కేసు కోర్టు విచారణలో ఉన్న సమయంలో.. విడాకులు కోరిన జంటలో ఆర్థికంగా ఆధారపడే వ్యక్తి.. మెయింటెనెన్స్  కోసం కోర్టు కోరవచ్చు. అంటే.. భార్య, భర్తపై ఆర్థికంగా ఆధారపడి ఉంటే.. తన కనీసం అవసరాల కోసం భర్త నుంచి మెయింటెనెన్స్  ను కోరవచ్చు. ఒక వేళ భర్త, భార్యపై ఆర్థికంగా ఆధారపడి ఉంటే.. అంటే భార్య ఉద్యోగం చేస్తూ భర్త ఇంటిని చూసుకుంటే ఉంటే.. అప్పుడు భర్త కూడా భార్య నుంచి తనకు మెయింటెనెన్స్  ఇచ్చాలని కోర్టును కోరవచ్చు. మరి ఈ సెక్షన్‌ 24ను అడ్డుపెట్టుకొని.. కర్ణాటకకు చెందిన మహిళ నెలకు రూ.6 లక్షలకు పైగా మెయింటెనెన్స్  కావాలని కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.