iDreamPost
android-app
ios-app

TS High Court: రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు!

  • Published Jan 05, 2024 | 8:54 PM Updated Updated Jan 05, 2024 | 8:54 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హైకోర్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త హైకోర్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైన చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

  • Published Jan 05, 2024 | 8:54 PMUpdated Jan 05, 2024 | 8:54 PM
TS High Court: రేవంత్ సర్కారు కీలక నిర్ణయం.. 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. సంక్షేమంతో పాటు ఇతర విషయాల మీద కూడ ఫోకస్ చేస్తున్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలో తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కొత్త హైకోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డెసిజన్ తీసుకుంది. నూతన హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమిని కేటాయింది. రాజేంద్రనగర్ మండలంలోని బుద్వేల్, ప్రేమావతిపేట దగ్గర స్థలం మంజూరు చేసింది. దీనికి సంబంధించి జీవో 55 కూడా జారీ చేసింది రేవంత్ సర్కారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.

గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధేతో పాటు పలువురు హైకోర్టు జడ్జిలు ఎంసీహెచ్​ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుత హైకోర్టు బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్త దాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కొత్త హైకోర్టు భవనానికి రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన భవనానికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత బిల్డింగ్​లోనే జరుగుతాయి. కొత్త భవనం నిర్మాణం పూర్తయి.. అక్కడికి హైకోర్టు మారిన అనంతరం పాత భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్​గా పరిరక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనాన్ని సిటీ కోర్టుకు లేదా మరేదైనా కోర్టు భవనానికి వాడుకోవాలని సీఎస్ శాంతకుమారిని ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్.

కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల భూమి బుద్వేల్ గ్రామ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 2,500 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 1966లో అప్పటి సర్కారు కేటాయించింది. ఇప్పుడు అదే భూమిలోని వంద ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. కాగా, కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించడంపై హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న అవసరాల మేరకు కొత్త బిల్డింగ్ ఇంపార్టెన్స్​ను గుర్తించి భూమి కేటాయించడం గొప్ప విషయమని తెలిపారు. మరి.. పాలనను పరుగులు పెట్టిస్తున్న రేవంత్ సర్కారు తాజాగా కొత్త హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు ఉచితంగా గ్రూప్స్ కోచింగ్!.. వెంటనే అప్లై చేసుకోండి