iDreamPost
android-app
ios-app

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు

  • Published Apr 06, 2024 | 9:13 PM Updated Updated Apr 06, 2024 | 9:13 PM

Madya Pradesh Court Judgment:ఇటీవల యువత లీవింగ్ రిలేషన్ షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత వారి అభిప్రాయాలు కలిసి ఉంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే విడిపోతున్నారు.

Madya Pradesh Court Judgment:ఇటీవల యువత లీవింగ్ రిలేషన్ షిప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెళ్లికి ముందు కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత వారి అభిప్రాయాలు కలిసి ఉంటే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే విడిపోతున్నారు.

సహజీవనం చేస్తే పెళ్లి చేసుకోకున్నా భరణం ఇవ్వాల్సిందే: హైకోర్టు

సహజీవనం (లీవింగ్ రిలేషన్ షిప్) అంటే పెళ్లి కాకుండా యువతీ యువకుడు కలిసి జీవించడం.ఈ కల్చర్ ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో కనిపిస్తుంది. కానీ ఇప్పుడు భారత్ లో కూడా లీవింగ్ రిలేషన్ షిప్ అనేది కామన్ అయ్యింది. ఇటీవల సహజీవన వ్యవస్థపై ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి.  కొంతమంది మగవాళ్లు ప్రేమ పేరుతో సహజీవనం చేసి అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. దీంతో ఆడవాళ్లు ఎంతోమంది రోడ్డున పడుతున్నారు. మరికొంత మంది హత్యలకు కూడా తెగబడుతున్నారు.  ఇలాంటి ఘటనలు తరుచూ దేశంలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా వివాహం, భరణం అంశంపై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ హైకోర్టు వివాహం, భరణం అంశంపై సంచలన తీర్పు ఇచ్చింది. పురుషుడితో చాలా కాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన తర్వాత భరణం పొందేందుకు అర్హురాలు అని తెలిపింది. చట్టబద్దంగా ఇరువురు పెళ్లి చేసుకోకుండా ఉన్నా.. చాలా ఏళ్లు సహజీవనం చేస్తే ఆ మహిళకు ఖచ్చితంగా భరణం చెల్లించాలని తీర్పు సారాంశం. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ ను హై కోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద రూ.1500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే (38), అనితా బోప్చే (48) ఇద్దరూ చాలా కాలం సహజీవనం చేశారు. వీరికి ఒక బిడ్డ కూడా జన్మించింది. ఇటీవల శైలేష్ బొప్చే ఆ మహిళను వదిలివేశాడు. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్యగా చెప్పుకుంటున్న ఆ మహిళను తాను వివాహం చేసుకోలేదని శైలేష్ బొప్చే కోర్టుకు విన్నవించాడు. ఈ కేసులో సదరు మహిళ చట్టబద్దంగా అతని భార్య కాదని సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ ఏమీ కోరలేదని బొప్చే తరుపు న్యాయవాది కోర్టుకు వాదల్ని వినిపించాడు. జస్టిస్ జీఎస్ అహ్లూవాలియా తో కూడిన బెంజ్ ఆ మహిళ సదరు వ్యక్తితో కొంత కాలం కలిసి జీవించిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది. సదరు మహిళకు నెలకు రూ.1500 భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్ధించింది.