Krishna Kowshik
ఇటీవల కాలంలో కోర్టు తీర్పులు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తల విడాకులు, ఇతర సమస్యల విషయాల్లో తీర్పులు విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఇటీవల కాలంలో కోర్టు తీర్పులు సంచలనాత్మకంగా మారుతున్నాయి. ముఖ్యంగా భార్యా భర్తల విడాకులు, ఇతర సమస్యల విషయాల్లో తీర్పులు విస్మయానికి గురి చేస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
Krishna Kowshik
భార్యా భర్తల మధ్య బంధం బీటలు వారుతుంటే.. సొల్యూషన్ కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోలేక.. న్యాయం కోసం నలుగురి ముందు సమస్యను ఉంచుతున్నారు. జీవిత భాగస్వామి విషయంలో శారీరకంగా, మానసికంగా అలసిపోయిన వ్యక్తులు చట్టం ఏమి చెబుతుందో అని ఎదురు చూస్తున్నారు. ఇక కోర్టుకు కేసు వెళ్లాక.. ఒక పట్టాన ముగిసిపోదు. అలాగే కోర్టులు కూడా వెంటనే తేల్చవు.. నిజ నిజాలు, వాస్తవాల ఆధారంగా తీర్పులు ఇస్తూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో భార్యా భర్తలకు సంబంధించిన పలు కేసుల్లో సంచలన తీర్పులు ఇస్తున్నాయి కోర్టులు. దంపతులు కోరుకుంటే.. వెంటనే విడాకులు మంజూరు చేయొచ్చునని చెబుతుంది సుప్రీంకోర్టు. ఇది మచ్చుకు ఒకటి మాత్రమే.. అలాంటివి చాలానే ఉన్నాయి.
ఇప్పుడు ఓ హైకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చి వార్తల్లో నిలిచింది. శృంగారానికి భార్య నిరాకరిస్తే భర్త విడాకులు తీసుకోవచ్చని పేర్కొంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ షీల్ నాగు, వినయ్ సరాఫ్‌లతో కూడిన ధర్మాసనం..ఆ తీర్పును తోసిపుచ్చింది. ఈ సందర్భంగా భర్తతో శృంగారాన్ని భార్య నిరాకరిచడం క్రూరత్వం కిందకు వస్తుందని పేర్కొంది. భార్య సరైన కారణాలు చెప్పకుండా.. శృంగారానికి నిరాకరిస్తుందని, తనను మానసికంగా హింసిస్తుందని, ఇది క్రూరత్వం కిందకు వస్తుందని పేర్కొంటూ 2014లో ఆమె నుండి విడాకులు కావాలంటూ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు భర్త.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.దీన్ని సవాలు చేస్తూ భర్త.. మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ అప్పీల్ విచారణ సందర్భంగా.. బాధితుడి వాదనను కోర్టు అంగీకరించింది. భర్తతో శృంగానికి అంగీకరించకపోతే అతడు విడాకులు కోరవచ్చునని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు తీర్పును రద్దు చేసింది. వివాహ చట్టం ప్రకారం విడాకులు కోరేందుకు భర్త చేస్తున్న వాదన సరైనదేనని సమర్థించింది. అలాగే.. గతంలో కూడా చత్తీస్ గఢ్ కోర్టు కూడా ఇదే రకమైన ఉత్తర్వులు ఇచ్చింది. శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమేనని పేర్కొంటూ.. వెంటనే దంపతులకు విడాకులు మంజూరు చేసింది. మరీ కోర్టు పేర్కొన్న ఈ తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.