P Venkatesh
P Venkatesh
అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో జరిగిన దాడి కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ప్రభుత్వ లాయర్లు, బాబు లాయర్ల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అంగళ్ల ఘటనలో బాబు ప్రోద్భలంతోనే దాడులు జరిగాయని ప్రభుత్వ లాయర్లు కోర్టుకు వెల్లడించారు. ఈ ఘటనలో సాధారణ ప్రజలతో పాటు విధుల్లో ఉన్న పోలీసులపై కూడా దాడి చేసి విధ్వంసం సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఈ క్రమంలోనే పోలీసులు బాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ బాబు పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీలో అరాచకానికి తెరలేపారు. ప్రజల నుంచి మద్దతు లభించకపోవడంతో ఆగస్టు నెలలో బాబు అతడి అనుచరులు పుంగనూరు హైవేపై మీటింగ్ పెట్టుకుని పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం పన్నారు. పోలీసులు అడ్డుకుంటే దాడులు చేయాలని టీడీపీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన బాబు. ఆగస్టు 4న బాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తలలు పగిలి, కన్నుపోయి తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు. అంగళ్లులో పోలీసులపై దాడులకు పాల్పడిన టీడీపీ ముఠా కొద్ది గంటల వ్యవధిలోనే చిత్తూరు జిల్లా పుంగనూరులో దాడులకు పాల్పడ్డారు. పోలీసుల వాహనాలు, ఆస్తులు ధ్వంసం చేసి అరాచకానికి పాల్పడ్డారు టీడీపీ కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు.