మన దేశంలో, రాష్ట్రాలలో ఒక్కోసారి ప్రభుత్వాలు కూలడం, అప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారం చేపట్టడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది పలు రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం మహారాష్ట్రం ప్రభుత్వానికి గండం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రెండు పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడింది. ఇప్పుడు అది కూలిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో విపక్షంలో ఉన్న బీజేపీ అధికారం కోసం చూస్తుంది. ఇలాగే గతంలోనూ బీజేపీ పలు […]
రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో […]
మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న కమల్ నాథ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి ఇదివరకే తెలియజేశారు. ఆమోదిస్తూ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు. శాసనసభా పక్ష నేతగా కమల్ నాథ్ రాజీనామా నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని వేణుగోపాల్ తెలిపారు. ఆయన స్థానంలో డా.గోవింద్ సింగ్ సీఎల్పీ నేతగా కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది. ఇంతకాలం సీఎల్పీ నేతగా కమల్ […]
వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనని.. వ్యూహకర్తగా మాత్రమే కొనసాగుతానని స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్, ప్రియాంకల గురించి ఆయన కామెంట్ చేశారు. గురువారం ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నాయకత్వ సూత్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేరని ప్రశాంత్ తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వంలో మూడో పేరు ఉందా అని […]
పార్టీలో చేరే అంశంపై కాంగ్రెస్ ప్రతిపాదనను ప్రశాంత్ కిషోర్ (పీకే) తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిణామాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందే ఊహించారని అంటున్నాయి పార్టీ వర్గాలు. త్వరలో ఏర్పాటు చేయనున్న ‘ఎంపవర్డ్ కాంగ్రెస్ కమిటీ’లో చేరమని కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్కు ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను పీకే తిరస్కరించాడు. గతంలో కూడా పీకే కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే, ఆ సమయంలో పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు. తాజాగా […]
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్.. ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తీసుకొస్తున్నారు. తాను చేస్తున్న పాదయాత్రతో వచ్చే మైలేజీని మరింత పెంచుకోవటానికి వీలుగా బండి ప్రయత్నాలు చేస్తున్నారు. శని.. ఆదివారాల్లో ప్రగతిభవన్ లో కూర్చొని సీఎం కేసీఆర్ తో సుదీర్ఘంగా మంతనాలు జరిపిన పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ ఉదంతంపై తనదైన శైలిలో కొత్త తరహా వాదనను వినిపిస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా.. కాంగ్రెస్ – టీఆర్ఎస్ మధ్య […]
కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ కీలకంగా మారింది. ఇప్పటికే పార్టీ పూర్వవైభవం కోసం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసిన కాంగ్రెస్ కమిటీ అధినేత్రికి రిపోర్టు ఇచ్చింది.ఇక దీనిపైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం 10 జనపథ్లో కీలక సమావేశం జరిగింది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరే విషయం, ఇప్పటికే ఆయన ఇచ్చిన నివేదికపై భేటీలో సీరియస్గా చర్చించారు. పీకే పార్టీలో చేరితే.. అప్పగించాల్సిన బాధ్యతలపై ఈ […]
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్(పీకే) తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. గత రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సుదీర్ఘ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పీకే.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ కోసం ఎలా పనిచేస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పీకే నేతృత్వంలోని ఐప్యాక్ సేవలు కొనసాగించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల […]
దేశవ్యాప్తంగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా భారీ ప్లాన్ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 377 సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఇందులో ఏపీ నుంచి వైసీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. అయితే ఇప్పటివరకూ ఒంటరిపోరునే నమ్ముకుంటున్న వైసీపీ ఇందుకు అంగీకరిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. దీనిపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. కాంగ్రెస్-వైసీపీ పొత్తు ఏపీ విభజనతో తెలుగు రాష్ట్రాల్లో […]
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయాడు. దేశంలోనే పొలిటికల్ స్త్రాటజిస్ట్ గా మంచి పేరున్న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ప్రశాంత్ కిషోర్ విషయంలో ఆలోచనలో పడింది. దేశంలో వరుసగా పరాజయాలను చవి చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ని ట్రాక్ లో పెట్టి 2024 ఎన్నికల టార్గెట్ గా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని, తన ఆలోచనలను అమలుచేస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చెక్ […]