iDreamPost
android-app
ios-app

CM రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో అనుమానాస్పద బ్యాగ్ క‌ల‌క‌లం

  • Published Sep 15, 2024 | 4:50 PM Updated Updated Sep 15, 2024 | 4:50 PM

Suspicious Bag Found CM Revanth Reddy House: ఇటీవల తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా సీఎం ఇంటి వద్ద ఓ బ్యాగ్ కలకలం రేపింది.

Suspicious Bag Found CM Revanth Reddy House: ఇటీవల తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. తాజాగా సీఎం ఇంటి వద్ద ఓ బ్యాగ్ కలకలం రేపింది.

CM రేవంత్ రెడ్డి ఇంటి స‌మీపంలో అనుమానాస్పద బ్యాగ్ క‌ల‌క‌లం

సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ, బడా వ్యాపారుల ఇంటివద్ద హై సెక్యూరిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత హై సెక్యూరిటీ ఉన్నా డొల్లతనాలు బయటపడుతూనే ఉంటాయి. మరవైపు కొంతమంది అగంతకులు పోలీసులకు ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్న సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. దాంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ హడావుడి మొదలవుతుంది. తీరా స్పాట్ కి వెళ్లిన తర్వాం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్ద బ్యాక్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఓ బ్యాక్ తీవ్ర కలకలం సృష్టించింది. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాగ్ వదిలి వెళ్లాడు. అనుమానాస్పద బ్యాగ్ గా గుర్తించి చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యింది. ఇంటెలిజెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. తక్షణమే అక్కడికి చేరుకున్న ఇంటెలిజెన్స్ విభాగం ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అక్కడి నుండి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి.. క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు సమాచారం. ఆ బ్యాగ్ అక్కడ ఎవరు వదిలి వెళ్లారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే గత వారం రోజుల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికేపూడి గాంధీ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్లతో అట్టుడికిపోయింది. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ తన అనుచరులతో వెళ్లడం దుమారం రేపింది. మరోవైపు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దాడులు చేయిస్తుందని ఆరోపణు చేయడం, బీఆర్ఎస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేయడం జరగడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో సీఎం ఇంటి వద్ద అనుమానాస్పదంగా బ్యాక్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది.