Arjun Suravaram
మంగళవారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉంటే.. హీరో వెంకటేశ్ వియ్యంకుడుఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
మంగళవారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉంటే.. హీరో వెంకటేశ్ వియ్యంకుడుఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా సుమారు నెలన్నర పాటు సాగిన లోక్ సభ ఎన్నికల సమరానికి నేటితో ముగింపు జరిగింది. మంగళవారం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అలానే తెలంగాణలో పార్లమెంట్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలుండగా.. కేవలం కాంగ్రెస్, బీజేపీ మధ్యలోనే హోరాహోరీ పోటీ నడిచింది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కనీసం ఖాతా కూడా తెరవకపోవటం గమనార్హం. ఇది ఇలా ఉంటే.. హీరో వెంకటేశ్ వియ్యంకుడు తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరపున రామసహాయం రఘురాం రెడ్డి పోటీ చేశారు. తాజాగా వెల్లడైన ఫలితాల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇక రఘురాం రెడ్డి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అంతేకాక ఆయన విక్టరీ వెంకటేష్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వియ్యకుండు. ఈ రోజు ఉదయం ఎన్నికల ఫలితాల్లో మొదటి రౌండ్ నుంచే రఘరాం రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. అలానే ఫూర్తి ఫలితాలు వెల్లడయ్యే సమయానికి.. 4.56 లక్షల భారీ మెజార్టీ సాధించారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రామసహాయం రఘురాం రెడ్డి.. బంపర్ మెజార్టీతో గెలవటం గమనార్హం.
ఇక రామసహాయం రఘురాంరెడ్డి రాజకీయ, వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన ఖమ్మం ఎంపీ స్థానం నుంచి బరిలో దిగినప్పటికీ ఆయన మహబూబాబాద్‌కు చెందిన. వీరిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. మాజీ ఎంపీ, ఎమ్మె్ల్యే రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాం రెడ్డి. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సురేందర్ రెడ్డి ఏకంగా నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు రాజకీయ నేపథ్యం గట్టిగా ఉంది. తండ్రి బలమైన రాజకీయ నాయకుడిగా ఉన్నప్పటికీ రఘురాం రెడ్డి.. వ్యాపారవేత్తగానే ఎదిగారు. ఇటీవలే కాంగ్రెస్ తరపున లోక్ సభ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు.
మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్న తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే నువ్వానేనా అన్నట్లు ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ 8 చోట్ల, బీజేపీ 7 చోట్ల, ఎంఐఎం 1 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ కి కనీసం ఒక్క సీటుకు కూడా రాకపోవడం గమన్హారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఇక్కడి లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మరి..తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.