iDreamPost
android-app
ios-app

జూన్ 19న పుట్టిన ప్రతి బిడ్డకు రూ.10వేలు ఎఫ్‌డీ! ఎక్కడంటే

రాజకీయ నేతల పుట్టిన రోజు వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ నేత మాత్రం జూన్ 19 తేదీన పుట్టిన వారికి రూ.10వేలు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

రాజకీయ నేతల పుట్టిన రోజు వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ నేత మాత్రం జూన్ 19 తేదీన పుట్టిన వారికి రూ.10వేలు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

జూన్ 19న పుట్టిన ప్రతి బిడ్డకు రూ.10వేలు ఎఫ్‌డీ! ఎక్కడంటే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రారంభించాయి. అలానే పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కోసం వివిధ స్కీమ్ లను పాలకులు అందిస్తున్నారు. ఆర్థిక భరోసాను కల్పించేందుకు వివిధ సంస్కరణలు చేపట్టారు. వీటితో పాటు ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో గుడ్ న్యూస్ లు కూడా చెబుతుంటారు. అలానే కొందరు నేతలు వివిధ రూపల్లో తమ నేతలపై అభిమానం చాటుకుంటారు. ఇదే సమయంలో తాజాగా ఓ కాంగ్రెస్ నేత ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. జూన్ 19 పుట్టిన ప్రతి బిడ్డకు రూ.10 వేలు ఫిక్స్ డిపాజిట్ చేశాడు. మరి.. ఆ నేత ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

రాజకీయ నేతల పుట్టిన రోజు వేడుకలను వారి అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటారు. అన్నదానం, పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ వంటివి చేస్తుంటారు. అంతేకాక మరికొందరు అయితే ఏకంగా రక్తదానం కూడా చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే..మరికొందరు తమ నాయకుడి పేరు మీదు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు భిన్నంగా మరికొందరు నాయకులు తమ అభిమాన నేతలపై ప్రేమను చూపిస్తుంటారు.  తాజాగా పటాన్ చెరువుకు చెందిన  కాంగ్రెస్ నేత నీలం మధు స్థానిక ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.  రాహుల్ గాంధీ బర్త్ డేను పురష్కరించుకుని ఆయన ఆ బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.

జూన్ 19న పటాన్ చెరువు ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ప్రతి బిడ్డకు రూ.10 వేలు ఫిక్సడ్ డిపాజిట్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం పటాన్ చెరువు ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రిలో పుట్టిన ఐదుగురికి సంబంధించిన రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ చెక్కను రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం  నీలం మధు మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌‌ గాంధీ బర్త్‌‌డే సందర్భంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అందరితో కలిసి పని చేస్తానని, భవిష్యత్‌‌లో రాహుల్‌‌ గాంధీని ప్రధాని చేయడమే తమ లక్ష్యమని నీలం మధు చెప్పుకొచ్చారు.

బుధవారం జూన్ 19న  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు కావడంతో.. దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేశారు. అంతేకాక కాంగ్రెస్ శ్రేణులు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు  సందర్భంగా పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పలువురు ప్రముఖులు రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషేష్ తెలియజేశారు.