iDreamPost
android-app
ios-app

ఎమ్మెల్యేలు గాంధీ vs కౌశిక్.. వీరి మధ్య గొడవ ఏంటీ?

  • Published Sep 12, 2024 | 3:06 PM Updated Updated Sep 12, 2024 | 3:06 PM

Arekapudi Gandhi vs Kaushik Reddy Issue: తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు.. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Arekapudi Gandhi vs Kaushik Reddy Issue: తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు.. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ళు.. ప్రతి సవాళ్ళతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఎమ్మెల్యేలు గాంధీ vs కౌశిక్.. వీరి మధ్య గొడవ ఏంటీ?

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్, అరికెపూడి గాంధీల మధ్య వివాదం మరింత ముదిరిపోతుంది. కౌశిల్ వేసిన సవాల్ స్వీకరించిన గాంధీ తన అనుచరులతో కలిసి హైదరాబాద్ సిటీ కొండాపూర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్, నిన్న చీరా – గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టింది.ప్రస్తుం కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇంతకీ వీరిద్దరి మధ్య చెలరేగిన వివాదం ఏంటీ? ఇద్దరు నేతలు ఏం సవాళ్లు విసురుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం.

ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శేర్‌లింగం‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ని పీఏసీ చైర్మన్ గా నియమించింది. ఈ నియామకంపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు ఆయనపై బీఆర్ఎస్ నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అరికెపూడి. అతను కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ప్రంతీయ విభేదాలు సృష్టిస్తున్నాడని.. అతని వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ‘నీ ఇంటికి వస్తా.. నీ ఇంటిపైనే బీఆర్ఎస్ జెండా ఎగరేస్తా? అంటూ సవాల్ విసిరిసాడు. దీనికి ప్రతి సవాల్ గా‘దమ్ముంటే నా ఇంటికి రా.. నువ్వో నేనో తేల్చుకుందాం’ అంటూ అరికపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరాడు. మొత్తానికి ఫిరాయింపుల ఎపిసోడ్ చీరా- గాజులు చూపిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వేసిన సవాల్, వివాదాస్పద వ్యాఖ్యలు అగ్గి రాజేసింది.

కౌశిక్ రెడ్డి విసిరిన సవాల్ ని అరికపూడి గాంధీ సీరియస్ గా తీసుకున్నారు.. తన అనుచరులతో కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. తనపై సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి సమాధానం ఇవ్వాలని అరికెపూడి గాంధీ డిమాండ్ చేశాడు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉండటంతో గాంధీ, కౌశిక్ రెడ్డి అనుచరులను చెదరగొట్టారు.  ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. నా ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తా అంటూ సవాల్ విసిరితే ఖాళీగా కూర్చున్నామా? కేసీఆర్ లాంటి వారు ఆ వ్యాఖ్యలు చేస్తే స్వాగతించేవాడిని.. నాతో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగినా సమాధానం చెప్పేవాడిని.. కౌశిక్ రెడ్డి లాంటి స్వార్థపరులు నోరు పారేసుకుంటూ చూస్తూ ఊరుకోం’ అని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కౌశిక్ రెడ్డి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతుందని.. సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఏం కల్పిస్తుందని ప్రశ్నించారు. అంతేకాదు శుక్రవారం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తాం అంటూ మరో సవాల్ విసిరారు కౌశిక్ రెడ్డి. మరి ఈ రచ్చ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.