iDreamPost

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించిన ఘనత YSRదే: CM రేవంత్ రెడ్డి

YSR, Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత నేత, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

YSR, Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివంగత నేత, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించిన ఘనత YSRదే: CM రేవంత్ రెడ్డి

ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ అనే గేయాన్ని ఆవిష్కరించారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ ప్రస్తావిస్తూ.. వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్సార్ దేనని రేవంత్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ అవతరణ జరిగి దశాబ్దం గడిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన వారు కవాతులు నిర్వహించారు. అలానే సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా పతాకావిష్కరణ చేశారు.  అనంతరం సీఎం రేవంత్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రముఖ కవి అందెశ్రీ రచంచిన తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ఈ కార్యక్రమంలో ఆ విష్కరించారు.

అనంతరం సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన లక్ష్యం, రాష్ట్రం కోసం కాంగ్రెస్ చేసిన కృషి వంటి విషయాలను ప్రస్తావించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనం అంశాలు తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి ప్రధానాంశాలని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి  రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ అన్నది  కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆరోగ్య శ్రీ ద్వారా తొలి సారి పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించిన ఘనత వైఎస్సార్ ది, కాంగ్రెస్ దని రేవంత్ రెడ్డి  అన్నారు. ఆరోగ్య శ్రీని మరింత సమర్థంగా అమలు చేయడానికి రూ. 5లక్షలు ఉన్న పరిధిని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నామన్నారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్సార్ ను మరోసారి గుర్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి