iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. అసలు ఏం జరిగిందంటే?

Attack on Congress leader Feroze Khan: ఓల్డ్ సిటీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. ఎంఐఎం నేత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ పై దాడికి పాల్పడ్డారు.

Attack on Congress leader Feroze Khan: ఓల్డ్ సిటీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య యుద్ధవాతావరణం నెలకొన్నది. ఎంఐఎం నేత కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ పై దాడికి పాల్పడ్డారు.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ పై దాడి.. అసలు ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో రాజకీయ రణరంగం చోటుచేసుకుంది. కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పాతబస్తీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆసిఫ్ నగర్ లో కాంగ్రెస్, ఎమ్ఐఎమ్ లీడర్ల మధ్య మొదలైన ఘర్షన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఫిరోజ్ ఖాన్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి రేగింది. ఫిరోజ్ ఖాన్ కు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆయన సొంతం. అన్యాయాలపై, అక్రమాలపై ప్రశ్నిస్తుంటారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పచ్చి కాంగ్రెస్ వాదిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటారు.

ఇది గిట్టని వారు ఫిరోజ్ పై విమర్శలకు పాల్పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో దాడులు సైతం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. ఈ దాడికి గల కారణం ఏంటంటే? ఆసిఫ్ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదురు గల్లీలోని ఫిరోజ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో గత శుక్రవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఉమర్ రోడ్డును తవ్వించాడు. రెండు వైపులా కాకుండా ఒక వైపు నుంచి పనులు చేయాలని స్థానికులు హూమాయున్ నగర్ పీఎస్​లో ఫిర్యాదు చేశారు. కాగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఉస్మాన్ ఇల్లు కూడా ఇదే రోడ్డులో ఉంది. ఇటీవల రోడ్డు పనుల కోసం పోసిన కంకరపై జారిపడి ఉస్మాన్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సోమవారం సాయంత్రం అక్కడికి వచ్చారు.

ఈ క్రమంలో రోడ్డు పనులను సక్రమంగా చేయడం లేదని ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. దీంతో స్థానిక ఎంఐఎం లీడర్లు ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కు సమాచారం అందించారు. వెంటనే ఆయన తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఫిరోజ్ ఖాన్ పై దాడికి పాల్పడ్డారు. ఫిరోజ్ ఖాన్ వర్గీయులు కూడా ప్రతి దాడికి దిగారు. కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో ఇరువర్గాలపై లాఠీచార్జ్​చేశారు. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాడుల నేపథ్యంలో స్థానికులు భయంతో వణికిపోయారు.

వెంటనే సౌత్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బలగాలను రంగంలోకి దించారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ విజయ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను శాంతింపజేశారు. ఎంఐఎం కార్పొరేటర్లు హుమాయున్ నగర్ పీఎస్​లో ఫిరోజ్ ఖాన్ పై ఫిర్యాదు చేయగా, ఫిరోజ్ ఖాన్ అనుచరులు కూడా ఫిర్యాదు చేసినట్లు డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. అయితే ఫిరోజ్ ఖాన్ కొంతకాలంగా మజ్లిస్ కు కొరకరాని కొయ్యగా మారారు. దీనికి గల కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంఐఎం పార్టీకి మంచి సత్సంబంధాలు ఉండేవి. కానీ అధికారం కోల్పోయాక మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కు దగ్గరైంది. రాజకీయ కారణాలతో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం పార్టీపై విరుచుకుపడుతున్నారు. ఆ పార్టీ లీడర్ల లోపాలను ఎత్తిచూపుతూ ఎండగడుతున్నాడు. దీంతో ఎంఐఎం లీడర్లు ఫిరోజ్ ఖాన్ పై విమర్శలు చేస్తూ దాడులకు దిగుతున్నారు.