iDreamPost
android-app
ios-app

BJP Hattrick: హర్యానాలో BJP హ్యాట్రిక్.. ఘన విజయానికి కారణాలు ఏంటంటే?

Haryana Election 2024- Reasons Behind BJP Hattrick: హర్యానా ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తలకిందులు చేసేసింది.

Haryana Election 2024- Reasons Behind BJP Hattrick: హర్యానా ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ తలకిందులు చేసేసింది.

BJP Hattrick: హర్యానాలో BJP హ్యాట్రిక్.. ఘన విజయానికి కారణాలు ఏంటంటే?

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024 ఫలితాలు వచ్చేశాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ నమోదు చేసింది. హర్యానా రాష్ట్ర చరిత్రలోనే ఏ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది లేదు. కానీ, ఆ చరిత్రను తుడిచిపెట్టేస్తూ.. బీజేపీ ముచ్చటగా మూడోసారి హర్యానాలో జయ కేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు మాత్రమే హర్యానాలో అధికారంలోకి రాగలిగింది. కానీ, బీజేపీ మాత్రం వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. 2014లో బీజేపీ పార్టీ హర్యానాలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో కూడా తమ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు 2024లో హర్యానా అధికారాన్ని దక్కించుకుని.. కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టింది. బీజేపీ 48 సీట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకుంది. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ.. కాంగ్రెస్ కు మాత్రమే కాకుండా.. ప్రధాన పార్టీలకు గట్టిగానే ఝలక్ ఇచ్చింది. మరి.. ఓటమి పాలవుతుంది అనుకున్న బీజేపీ ఎలా విజయం సాధించింది? అందుకు గల కారణాలు ఏంటో చూద్దాం.

హర్యానా ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పుంజుకుంటే చూడాలి అని కొంతమంది భావించారు. మరికొంత మంది మాత్రం బీజేపీ మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. ఎగ్జిట్ పోల్స్ చూస్తే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎక్కడా బీజేపీ ఊసులేదు. హర్యానాలో కాంగ్రెస్ హవా ఉంటుందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీట్ల పరంగా పుంజుకుంది. కానీ, అంతిమ ఫలితంలో మాత్రం తడబడింది. బీజేపీ మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. కౌటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి బీజేపీ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది.

గతంతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పర్వాలేదు అనిపించినా.. బీజేపీ మాత్రం బ్రేకుల్లేకుండా దూసుకుపోయింది. మ్యాజిక్ ఫిగర్ సాధించి అందరికీ గట్టి షాకిచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా పదేళ్లపాటు ఒక పార్టీ అధికారంలో ఉంటే.. కచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. మూడోసారి ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. కానీ, బీజేపీ మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ.. ముచ్చటగా మూడోసారి రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకుంది. అయితే అధికార బీజేపీ మీద వ్యతిరేకత లేదా అంటే.. కచ్చితంగా ఉంది. కానీ ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి.

కాంగ్రెస్ సహా.. ప్రధాన పార్టీలు విఫలం కావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా వ్యతిరేక ఓట్ల గురించే మాట్లాడుకోవాలి. అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నీ ఒక్క తాటి మీదకు రావాలి. కానీ, హర్యానాలో ఆ పరిస్థితి కనిపించలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడంతోనే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిగా అన్నీ పార్టీలు కలిశాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఎవరి దారి వారు చూసుకున్నారు. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ తో కలవలేదు. BJP హ్యాట్రిక్ విజయంలో JJP కూడా కీలక భూమిక పోషించింది. వ్యతిరేక ఓట్లను చీల్చడంలో JJP కీలక పాత్ర పోషించింది. నిజానికి హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ కి కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి. అగ్నివీర్ రిక్రూట్ మెంట్లో సమస్యలు, జాట్లు చేసిన పోరాటాలు, రైతుల చేసిన ఆందోళనలు, రెజలర్లు రోడ్లపైకి రావడం.. ఇలా చాలానే సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కాంగ్రెస్ కి బాగా కలిసొస్తుంది అనుకున్నారు.

కానీ, అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. తమ ఓటర్లను కాపాడుకోవడంలో బీజేపీ సూపర్ సక్సెస్ అయ్యింది. అంతేకాకుండా బీజేపీ చేసిన ప్రయోగాలు కూడా కలిసొచ్చాయి. చివరి నిమిషంలో మనోహర్ లాల్ ఖట్టర్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. ఆయన్ను కేంద్రమంత్రిగా చేసింది. ఆయన స్థానంలో నయాబ్ సింగ్ సైనీని సీఎం చేయడం బీజేపీకి కలిసొచ్చింది. అంతేకాకుండా బీసీలను ఆకట్టుకోవడం కూడా బీజేపీ ఓట్లు కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతనే కాదు.. తాము ఇచ్చిన గ్యారెంటీలను కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. చూడటానికి అసలు పోటీ బీజేపీ- కాంగ్రెస్ మధ్యే ఉంది. కానీ.. ఆప్, JJP, INLD పార్టీలు.. వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్లే బీజేపీకి ఈ విజయం సాధ్యమైంది. మరి.. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.