ఆంధప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార, పత్రిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికగా మారగా.. తాజాగా ఎన్నికల వాయిదా అంశం సవాళ్లకు దారితీస్తోంది. సాధారణంగా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి సవాళ్లు వస్తుంటాయి. కానీ చిత్రంగా ఏపీలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్షానికి సవాళ్లు వెళుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అరాచకాలకు పాల్పడుతోందని, పోలీసులను ఉపయోగిస్తూ తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, అందుకే భారీ సంఖ్యలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు […]
సరిగ్గా నేటికి జనసేన పార్టీ స్థాపించి ఆరేళ్లవుతోంది. 2014 సాధారణ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భవించింది. పార్టీ నిర్మాణం జరగలేదంటూ చెప్పిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్ధతిచ్చారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల వరకూ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టని జనసేనాని.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు తనదైన శైలిలో ఊగిపోతూ ప్రకటించారు. గడిచిన సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో […]
అడిగిందే తడవుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి వరాలు ప్రకటిస్తున్నారు. ఈ సీఎం చేతికి ఎముకలేదేమో అన్నట్లుగా ఆయన చిరుజీవుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన సంవత్సరాల తరబడి పని చేస్తున్నా కనీస వేతనాల కరువైన వారికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ వరాలు కురిపిస్తున్నారు. తాజా సర్వశిక్షాభియాన్‌లో పని చేస్తున్న సీఆర్పీ(క్లస్టర్ రిసోర్స్ పర్సన్)లకు ఒకే దఫా ఐదు వేల రూపాయల జీతం పెంచారు. అంతకు ముందు […]
దేశంలో 81 కరోనా కేసులు బయటపడిన నేపథ్యంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది.. కర్ణాటక వ్యక్తి హైదరాబాద్ హాస్పిటల్ లో కరోనా వైరస్ తో మృతి చెందడంతో వారం పాటు రేపటి నుంచి వారం రోజులపాటు మాల్స్, థియేటర్లు, పాఠశాలలు, కాలేజీలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా […]
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయడుకు వస్తున్న ప్రజాధారణ ఓర్వలేకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌పై విరుచుపడ్డారు. బీసీల ఎదుగుదల చూసి జగన్‌కు కడుపు మంట.. అంటూ కూడా తనదైన శైలితో ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల, వైద్య పరికరాల కొనుగోళ్లలో 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుదే కీలక […]
పేదింటి యువతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పెళ్లి కానుకల కోసం నిధులు విడుదల చేసింది.. త్వరలోనే ఈ డబ్బు అకౌంట్లలో జమకానున్నాయి. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత అర్హత సాధించిన వారికి నగదు జమ అవుతుంది. కాగా, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేసేందుకు జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్నిపెంచింది.. వైఎస్సార్ పెళ్లి కానుకగా అందజేసేందుకు […]
మొన్నటిదాకా ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ మాట్లాడిన విపక్ష పార్టీల స్వరం ఇప్పుడు మారుతోంది. అమరావతి పేరిట పెయిడ్ ఉద్యమం చేస్తున్న నేతలు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గ్రహిస్తున్నట్లున్నారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అమరావతి ముద్దు.. మూడు రాజధానులు వద్దు అన్న నేతలు.. ఇప్పుడు రెండు రాజధానులు ముద్దు అంటున్నారు. ఇక రేపో మాపో మూడు రాజధానులు ముద్దు అనే అవకాశం లేకపోలేదని ఆ పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. […]
ప్రజలకు మేలు చేయడం కంటే న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తారని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఎందరో మేధావులు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చెబుతుంటారు. తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్‌కు జాగ్రత్తలు చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ […]
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధి ఇప్పటికీ అంతంతమాత్రంగానే ఉంది. గత ఐదేళ్ల పాలనలో విభజన తర్వాత ఏకైక పరిశ్రమగా కియా మోటార్స్ నిలిచింది. అనంతపురం జిల్లాలో స్థాపించిన కియా మోటార్స్ కంపెనీ ఇటీవల ఉత్పత్తి ప్రారంభించింది. అయితే ఏపీలో మారిన రాజకీయ పరిణామాలతో పలు మార్లు కియా వార్తల్లోకెక్కుతోంది. ముఖ్యంగా విపక్షం పలు విమర్శల్లో భాగంగా కియా మోటార్స్ కూడా ఏపీ నుంచి తరలిపోయిందనే విమర్శలు వేస్తోంది. రెండు రోజుల క్రితం చంద్రబాబు అవే మాటలు చెప్పారు. ఆతర్వాత […]
రాష్ట్ర రాజధానులను ఆ రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదంటూ నిన్న మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చేసిన ప్రకటనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త అర్థం చెప్పారు. ఈ రోజు అమరావతిలో రైతు ఆందోళన సభలో ఆయన రైతులనుద్ధేశించి మాట్లాడారు. రాజధానిని నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. కానీ రాజధానిని మార్చే అధికారం లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అసలు మూడు రాజధానులు పెట్టే అధికారమే లేదన్నారు. […]