అభివృద్ది వికేంద్రీకరణ, ముడు రాజధానుల అంశం పై ఈరోజు ఉదయం నుండి అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతున్న సందర్భంలో విపక్ష నాయకుడు చంద్రబాబు దాదాపు గంటన్నర పాటు సుధీర్ఘంగా ప్రసంగించిన తరువాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని మొదలుపెట్టగానే సభలో తెలుగుదేశం శాసన సభ్యులు మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యడం మొదలుపెట్టారు.
అంతటితో ఆగకుండా స్పీకర్ ఎంత వారించినా వినకుండా పొడియం చుట్టుముట్టీ మాటి మాటికి ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు తగలడంతో స్పీకర్ సభని కంట్రోలు చెయ్యడానికి ప్రయత్నించినప్పటికి సభ కంట్రోల్ లోకి రాక పోవడంతో ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డు పడుతున్న విపక్ష సభ్యుల్ని సభ నుండి సస్పెండ్ చెయ్యాలని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ రెడ్డి ప్రతిపాదించగా స్పీకర్ తమ్మినేని సీతారాం 17 మంది విపక్ష సభ్యుల్ని సభ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ కి గురైన సభ్యులు స్పీకర్ పొడియం చుట్టుముట్టి నినాదాలు చేస్తుండడంతో మార్షల్స్ ద్వారా సస్పెండ్ అయిన సభ్యుల్ని సభ నుండి బయటకి పంపించారు.