Idream media
Idream media
ప్రజలకు మేలు చేయడం కంటే న్యాయ, అధికార, రాజకీయ వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఎక్కువ ప్రాధాన్యమిస్తారని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఎందరో మేధావులు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా చెబుతుంటారు.
తాజాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం జగన్‌కు జాగ్రత్తలు చెప్పారు. పరిపాలనా రాజధానిగా విశాఖను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్ధతు పలుకుతూ సీఎం జగన్‌కు ఒక లేఖ రాశారు. చంద్రబాబు కొన్ని వ్యవస్థలతో తనకున్న దీర్ఘకాలిక సంబంధాలతో మూడు రాజధానుల ప్రక్రియకు బలమైన ప్రతిబంధకాలు తీసుకొస్తారని చెప్పుకొచ్చారు. అలాంటి జిమ్మిక్కులు చంద్రబాబు ఎన్నిచేసినా వాటన్నింటినీ సమర్థంగా అధిగమించి మూడు రాజధానుల ప్రక్రియను పూర్తి చేస్తారని ఆశిస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు వెళ్లాలని సూచించారు. అమరావతి అనేది ఒక ఊహజనిత నగరమని, అది ఎప్పటికీ ఆచరణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు.