Idream media
Idream media
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయడుకు వస్తున్న ప్రజాధారణ ఓర్వలేకే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌పై విరుచుపడ్డారు. బీసీల ఎదుగుదల చూసి జగన్‌కు కడుపు మంట.. అంటూ కూడా తనదైన శైలితో ఫైర్ అయ్యారు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందుల, వైద్య పరికరాల కొనుగోళ్లలో 151 కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుదే కీలక పాత్ర అని తేలడంతో బాబు పై విధంగా ముందుకెళ్లడం ప్రారంభించారు.
నీతికి, నిజాయతీకి తన పార్టీ టీడీపీ మారుపేరని, 40 ఏళ్లుగా నిప్పులా బతికానని చెప్పుకునే చంద్రబాబు.. అమరావతి ఇన్‌సైడర్ ట్రేండింగ్ ఆరోపణలపై అన్నట్లుగా.. మేము ఏ తప్పు చేయలేదు.. కావాలంటే విచారణ చేసుకోండి.. బాధ్యులపై చర్యలు తీసుకోండని ఎందుకు సవాల్ అనడంలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలా అనకుండా కులాల పేరును వాడడం నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు సరికాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
తెలంగాణాలో చేసినట్లు ఇక్కడ చేయమన్నాం.. ప్రధానిమోదీ చెబితేనే తాను చేశాను.. అంటూ చెబుతున్న అచ్చెన్న.. ఈ దోపిడీలో తనకు సంబంధం లేదని, కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటన చేయొచ్చు కదా అనే డిమాండ్లు వస్తున్నాయి. అధికారపార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా దోపిడీకి గురైన సొమ్ము తిరిగిరాదు. దోషులకు శిక్ష పడదు. ఈ వ్యవహారంలో ఎంతటివారున్న విచారణ చేసిన, చర్యలు తీసుకోండంటూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఆయన చెప్పినట్లే పరిపాలనలో అనుభవం లేని సీఎం జగన్‌కు సలహా ఇవ్వొచ్చు కదా అని పరిశీలకులు సూచిస్తున్నారు.