ఛత్తీస్ ఘడ్ లో ఓ బాలుడు నాలుగున్నర రోజుల క్రితం బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 110 గంటలు బోరుబావిలోనే ఉన్న బాలుడిని రక్షణ సిబ్బంది, అధికారులు నిర్విరామంగా శ్రమించి.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఛత్తీస్ ఘడ్ లోని పిహ్రిద్ గ్రామానికి చెందిన రాహుల్ సాహు (11) అనే బాలుడు శుక్రవారం (జూన్ 10) సాయంత్రం బోరుబావిలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అధికార యంత్రాంగం రక్షణ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఎస్పీతో […]
పెళ్లైన వ్యక్తి.. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడి గుట్టు రట్టు చేయాలని భావించిన భార్య.. వారిద్దరినీ నగ్నంగానే బయటికి ఈడ్చుకొచ్చి.. ఊరంతా ఊరేగించి.. ఘోరంగా అవమానించింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని కొండాగావ్ లో జరిగింది. కొండాగావ్ కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉంటోన్న 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూన్ 11న భార్య […]
ఒకే వేదికపై ఇద్దరు తల్లుల్ని పెళ్లాడో వ్యక్తి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఇద్దరూ తల్లులు అవడానికి కారణం అతనే. ఒకరితో నిశ్చితార్థమయ్యాక.. మరో యువతిని ప్రేమించి.. ఇద్దరితోనూ ఇద్దరు పిల్లల్ని కన్నాక, ఆ ఇద్దరు యువతుల్నీ ఒకేవేదికపై పెళ్లాడిన ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది. కేశ్ కాల్ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్ సలామ్ కు అండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్ తో నిశ్చితార్థమయింది. నిశ్చితార్థం అనంతరం […]
కరోనా వైరస్ ప్రభావముతో ప్రపంచం చిగురుటాకులాగా వణుకుతున్న విపత్కర పరిస్థితిలోనూ వర్గ పోరు ఆపడం లేదు మావోయిస్టులు.ఛత్తీస్గఢ్ అడవులలో మళ్లీ రక్తపు టేరులు పారించారు.శనివారం మధ్యాహ్నం సుక్మా అడవులలో ఎదురు కాల్పుల సంఘటన తర్వాత అదృశ్యమైన 17 కోబ్రా దళ సిబ్బంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అధునాతన డ్రోన్ల సహాయంతో సుక్మా అడవినీ జల్లెడ పట్టడంతో ఈరోజు మధ్యాహ్నం వీరి మృతదేహాలు కనిపించాయి.మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరు చనిపోయారని ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. మృతులలో ముగ్గురు […]