iDreamPost
android-app
ios-app

ఒక్క కుర్రాడు! ఇద్దరు అమ్మాయిలు.. కోరిక తీర్చమన్నందుకు!

  • Published Mar 30, 2024 | 9:20 PM Updated Updated Mar 30, 2024 | 9:20 PM

Balrampur Crime News: ఈ మద్య చాలా మంది ప్రేమించుకొని కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

Balrampur Crime News: ఈ మద్య చాలా మంది ప్రేమించుకొని కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

  • Published Mar 30, 2024 | 9:20 PMUpdated Mar 30, 2024 | 9:20 PM
ఒక్క కుర్రాడు! ఇద్దరు అమ్మాయిలు.. కోరిక తీర్చమన్నందుకు!

ప్రస్తుత సమాజంలో చాలా మంది పెద్దలు కుదర్చిన పెళ్లి కన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. తమకు నచ్చిన వారికి ప్రపోజ్ చేసి వారితో కొంత కాలం రిలేషన్ లో ఉంటున్నారు. ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమంది లీవింగ్ రిలేషన్ లో తేడాలు రావడంతో విడిపోతున్నారు. కొంతమంది యువకులు లీవింగ్ రిలేషన్ లో లైంగిక కోరిక తీర్చుకున్న తర్వాత అమ్మాయిలకు గుడ్ బై చెబుతున్నారు. దీంతో ఎంతోమంది యువతులు రోడ్డున పడుతున్నారు. తన బాయ్ ఫ్రెండ్ లైంగిక కోరి తీర్చమన్నందుకు యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

చత్తీస్‌గఢ్ బలరాంపూర్ జిల్లాలో దారుణ గటన వెలుగు చూసింది. జిల్లాలోని పుట్సురా గ్రామినిక చెందిన వీరేంద్ర యాదవ్ (18) తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఓ వైపు కాలేజ్ కి వెళ్తూ.. మరో వైపు బట్టల షాపులో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వీరేంద్రకు పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఇద్దరూ కలిసి సినిమాలకు, షికార్లకు వెళ్లారు. యువతి తన స్నేహితురాలితో కలిసి  అద్దె ఇంట్లో ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుంది. వీరేంద్ర తన ప్రియురాలి కోసం బహుమతులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకోవడం వల్ల వీరేంద్ర ఆమెతో ఉన్న చనువుతో తన కోరిక తీర్చమని ఫోర్స్ చేయడం మొదలు పెట్టాడు.

ఇటీవల యువకులు ప్రేమ పేరుతో లైంగిక వాంఛ తీర్చుకొని తర్వాత ముఖం తిప్పేస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యువతి వీరేంద్రకు నో చెబుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రోజూ వీరేంద్ర లైంగిక కోరిక తీర్చమని బలవంత పెట్టసాగాడు. ఆ ఒత్తిడి భరించలేక సదరు యువతి తన మైనర్ స్నేహితురాలితో ఓ ప్లాన్ వేసింది. ఈ నెల 26వ తేదీన వీరేంద్రను తాము ఉంటున్న ఇంటికి పిలిపించి నైలాన్ తాడుతో అతని మెడకు బిగించి హత్య చేశారు. తన అన్న కనిపించడం లేదని వీరేంద్ర సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సదరు యువతిపై అనుమానం పట్టుకొని తమదైన స్టైల్లో విచారించారు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలిన బలవంతం చేయడం వల్ల ఏం చేయాలో పాలుపోక హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటనపై బలరాంపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom