iDreamPost
android-app
ios-app

వీడియో: భారీ ఎన్ కౌంటర్.. అగ్రనేతలు సహా 12 మంది మావోయిస్టులు హతం!

Devendra Fadnavis Announced 51 Lakh Reward For Gadchiroli Police: ఛత్తీస్ గఢ్- గడ్చిరౌలీ బోర్డర్ కాన్కెర్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

Devendra Fadnavis Announced 51 Lakh Reward For Gadchiroli Police: ఛత్తీస్ గఢ్- గడ్చిరౌలీ బోర్డర్ కాన్కెర్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

వీడియో: భారీ ఎన్ కౌంటర్.. అగ్రనేతలు సహా 12 మంది మావోయిస్టులు హతం!

మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య భీకర పోరు జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కదలికల గురించి గడ్చిరౌలి పోలీసులకు పక్కా సమాచారం అందిన తర్వాతే ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసినట్లు చెప్తున్నారు. మృతి చెందిన వారిలో అగ్ర నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత లక్ష్మణ్ ఆత్రం కూడా ఈ ఎన్ కౌంటర్లో చనిపోయినట్లు చెప్తున్నారు. ఇంక ఘటనాస్థంలో మావోయిస్టుల నుంచి అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

ఛత్తీస్ గఢ్ బోర్డర్ లోని వండోలిలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాదాపు 12 నుంచి 15 మంది వరకు ఉన్నట్లు వారికి తెలిసింది. డిప్యూటీ ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తుతో పోలీసులు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ ఆపరేషన్ సాగింది. మధ్యాహ్నం మొదలైన కాల్పులు దాదాపుగా 6 గంటల పాటు కొనసాగినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారిలో మావోయిస్టుల ముఖ్య నేత లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మిగిలిన వారిని కూడా గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఒక సబ్ ఇన్ స్పెక్టర్- ఒక జావానుకు గాయాలు అయ్యాయి.

అయితే వారికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు. అలాగే వారిని మెరుగైన చికిత్స కోసం హెలికాప్టర్ లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్ణవీస్ స్పందించారు. “గడ్చిరౌలీ పోలీస్ సీ60 కమాండోస్ ఒక మేజర్ ఆపరేషన్ కండక్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్- గడ్చిరౌలీ బోర్డర్ కాన్కెర్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో మొత్తం 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఆటోమేటిక్ మెషిన్ గన్స్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. సబ్ ఇన్ స్పెక్టర్- జవాను గాయాలు అయ్యాయి. ఎలాంటి ప్రమాదం లేదు. ఈ ఆపరేషన్ నిర్వహించిన టీమ్ కి ప్రభుత్వం తరఫున రూ.51 లక్షల రివార్డు ప్రకటిస్తున్నాం” అంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు.