Uppula Naresh
దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు ప్రధాని నరేంద్ర మోడీ మరో శుభవార్త చెప్పారు. ఆయన ప్రకటనతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు ప్రధాని నరేంద్ర మోడీ మరో శుభవార్త చెప్పారు. ఆయన ప్రకటనతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోడీ చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
Uppula Naresh
త్వరలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ రకాల హామీలను ప్రజల వద్దకు తీసుకెళ్లూ వారిని తమ వైపుకు తిప్పుకుని ఓట్లను కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషర్ కార్డు కలిగిన వారికి ఓ గుడ్ న్యూస్ ను అందించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో ఇస్తున్న ఉచిత రేషన్ ను మరో ఐదేళ్ల పాటు అలాగే కొనసాగిస్తామని ప్రధాని వెల్లడించారు.
మోడీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. దీన్ని 2028 వరకు అలాగే కొనసాగించాలని ప్రధాని చెప్పడంతో దేశ వ్యాప్తంగా ఉన్న పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మోడీ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్నాయి. ఎన్నికల స్టంట్ లో భాగంగానే ప్రధాని ఈ ప్రకటన చేసి ఉండవచ్చని తెలిపాయి. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో ఇస్తున్న ఉచిత రేషన్ ను కొనసాగించాలన్న ప్రధాని మోడీ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Free Ration scheme to 80 crore Bharatiyas extended for the next 5 years till 2028 …
This is huge @narendramodi 🔥 pic.twitter.com/hzQI9oyFn2
— BALA (@erbmjha) November 4, 2023