Swetha
అయోధ్య మహా నగరంలో ప్రాణ ప్రతిష్ట జరిగిన వేళా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మరో ప్రాంతంలో అక్కడి ప్రజలు ఒళ్ళంతా రామ నామాలే పచ్చబొట్లుగా పొడిపించుకుని.. భజన చేయనున్నారు.
అయోధ్య మహా నగరంలో ప్రాణ ప్రతిష్ట జరిగిన వేళా.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మరో ప్రాంతంలో అక్కడి ప్రజలు ఒళ్ళంతా రామ నామాలే పచ్చబొట్లుగా పొడిపించుకుని.. భజన చేయనున్నారు.
Swetha
అంతా అనుకున్నట్లుగానే దివ్యంగా.. ఆ బాల రాముడు తన స్థానంలో పదిలంగా కొలువుతీరాడు. ఈ మహత్తర తరుణం మరల రానిది.. అందుకోసం యావత్ భారతదేశం కన్నులారా .. తనివితీరా.. ప్రత్యేక్షంగా పరోక్షంగా.. ఈ సన్నివేశాలను చూడడటంలో నిమగ్నం అయిపోయారు. ఈ క్రమంలో మరో రాష్ట్రంలోని ఓ తెగకు సంబదించిన ప్రజలు.. ఒళ్ళంతా రామ నామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకుని.. మూడు రోజులు పాటు రామ నామాన్ని స్మరిస్తూ.. భజనలు చేస్తారట. అయితే, ఈ వింత ఆచారం కొన్ని ఏళ్లుగా పాటిస్తూనే ఉన్నారట. కానీ, ఈసారి ఇదే సమయానికి అయోధ్యలో ఆ బాల రాముడు కొలువుతీరడంతో.. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఈ వింత ఆచారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కస్‌డోల్‌లో జరుగుతోంది. ఇప్పుడు ‘బడే భజన్ మేళా’ కోసం ఈ ప్రాంత వాసులు రెడీ అవుతున్నారు. వీరిని రామ నామిలు అంటారు. రామ నామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకోవడం ఇక్కడి వారి ఆచారం. అయితే, ఈ ఆచారం ఈ మధ్య మొదలైనది కాదు. సుమారు వందేళ్లుగా ఏటా మహానది తీరాన ‘బడే భజన్ మేళా’ ఉత్సవాన్ని నిర్వహిస్తారట. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుపుతారని.. అలాగే ఈ భజన మేళాలో కొన్ని వేల మంది ఒకే చోట చేరి.. రామచరిత మానస్ తో పాటు రామ నామం స్మరిస్తూ భజన చేస్తారట. అయితే ఈ ఏడాది ఈ కార్యక్రమం జనవరి 21 నుంచి 23 మధ్యన జరగనుంది.
కాగా, ఈ విషయమై అక్కడి వారు మాట్లాడుతూ.. “మూడు రోజుల పాటు వేల మంది రామనామీలు రామాయణంలోని కీర్తనలు ఆలపించి, రామాయణాన్ని కళ్లకు కట్టేలా ప్రదర్శన నిర్వహిస్తారు. ఈసారి మేము మేళా నిర్వహించే సమయానికి.. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరుగుతోంది. రామ నామాన్ని శరీరమంతా శాశ్వతమైన పచ్చబొట్లుగా వేయించుకునే రామనామీల తెగ మాది. ‘నఖశిఖ’ పర్యంతం అంటే తల మొదలుకొని కాలిగోరు వరకు.. శరీరంపై రామ నామాన్ని పచ్చబొట్లుగా వేయించుకుంటాం. ఈ తెగలో ఉదయం పలకరింపు రామ్-రామ్ అంటూ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి రోజంతా ఏ పని చేసినా రామనామాన్ని స్మరిస్తాము” అంటూ పేర్కొన్నారు. కానీ, ఈ జాతి ప్రజలు విగ్రహారాధనను మాత్రం నమ్మరు. నిరాడంబర రాముని రూపాన్ని భజనల రూపంలో రామచరిత్ మానస్‌లోని పద్యాలను ఆలపిస్తూ ఆరాధిస్తు ఉంటారు. ఏదేమైనా.. సరిగ్గా వందల సంవత్సరాలుగా పాటిస్తున్న ఆచారంలో భాగంగా ‘బడే భజన్ మేళా’ జరిగే సమయానికి.. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన ఉత్సవాలు జరగడం విశేషం. మరి, రామనామిలు పాటిస్తున్న ఈ వింత ఆచారలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.