ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి […]
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ బిశ్వభూషణ్ తన పసంగంలో రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో జగన్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పథకాలు ఏ స్థాయిలో ప్రజలకి అందాయి అనే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంచరించుకున్న రాజధానుల విషయంపై కూడా స్పందించారు. గవర్నర్ తన ప్రసంగంలో పరిపాలనా వికేద్రీకరణ అంశాన్నీ కీలకంగా ప్రస్థావిస్తూ. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా […]
అందరూ ఊహించినట్లుగానే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. ఉభయ సభలు ప్రారంభం కాగానే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. గవర్నర్ తన ప్రసంగం ప్రారంభించగానే టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. నల్లచొక్కాలు ధరించి సభలకు హాజరైన టీడీపీ సభ్యులు తమ తమ స్థానాల్లో నిలబడి అక్రమ అరెస్ట్లు ఆపాలని.. ప్రజా స్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ ఆసాంతం […]
కరోనా వైరస్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలపై కూడా పడింది. ఈ నెల 27వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేయడం అనివార్యమైంది. ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. వచ్చే ఆర్థిక ఏడాది 2020–21కి అవసరమైన బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. రూపొందించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, […]
దేశవ్యాప్తంగా పలు దఫాలుగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత శీతాకాల సమవేశాలతోపాటు బడ్జెట్ సెషన్ కూడా ముగియనుంది.. అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎంతఖర్చు పెట్టారో చాలామంది ఇప్పటివరకు లెక్క చెప్పలేదట.. దేశంలో మొత్తం 80 మంది ఎంపీలు అసలు లెక్కలు చూపలేదని, ఇందులో మన తెలుగు ఎంపీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల వాచ్ అనే సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. లెక్కలుచూపని ఎంపీల్లో ఏపీ, తెలంగాణకు చెందిన 17మంది […]
వికేంద్రీకరణ బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపించడం తో మొదలయిన రాజకీయ దుమారం కొనసాగుతోంది. సెలక్ట్ కమిటీ చుట్టూ అలముకున్న రాజకీయ వివాదం చివరకు మండలిని ముగింపు దశకు చేర్చింది. అయినా ప్రతిపక్షం పట్టు సడలించడం లేదు. సెలక్ట్ కమిటీ విషయంలో తన ప్రయత్నాలు సాగిస్తోంది. సర్కారుకి చెక్ పెట్టేందుకు అదే ప్రధాన అస్త్రంగా భావిస్తోంది. ఇప్పటికే మండలి తీర్మానం విషయంలో కేంద్రం ఎప్పటికి కనికరిస్తుందన్నది స్పష్టత లేదు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో ప్రవేశ పెట్టే […]
కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఆంధ్ర ప్రదేశ్కు మరోసారి తీవ్ర నిరాశ ఎదురైంది. కేంద్ర పన్నుల వాటానుండి ఏపీకి ఇవ్వాల్సిన నిధుల్లోనూ భారీగా కోత పడింది. 14 వ ఆర్థికసంఘం సిఫార్సులనూ పట్టించుకోలేదు. వచ్చే ఏడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను 4.11శాతానికి తగ్గించింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ వరుసగా ప్రతీ ఏడాది రెవెన్యూ లోటులో ఉంటున్న నేపథ్యంలో వచ్చే ఐదేళ్లపాటు కూడా రెవెన్యూ లోటులోనే ఉంటుందని, ఇందుకు గ్రాంటును […]
బడ్జెట్ ఇదో బ్రహ్మపదార్థం. ఆర్థిక నిపుణులకు మినహా సాధారణ పౌరులకు అర్థం కాదు. ఏ రంగానికి ఎంత కేటాయించారనే లెక్కలు తప్పా.. మరే విషయాలు పెద్దగా అర్థం కావు. ఇక మరో బ్రహ్మపదార్థం.. జీడీపీ. వీటన్నింటిపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు, పెట్టిన తర్వాత చర్చ సాగుతుంది. అయితే ప్రతి సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికారపార్టీ బడ్జెట్కు అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తాయి. ఒకే వాక్యంతో ఉండే రాజకీయ నేతల […]
బడ్జెట్ అనేది బ్రహ్మపదార్థం. అంత సులభంగా అర్థం కాదు. ఒకప్పుడు బడ్జెట్ రావడానికి ముందే సిగరెట్ల రేట్లు పెరిగేవి. బడ్జెట్ తర్వాత టీవీల రేట్లు పెరుగుతాయి, ఇప్పుడే కొనమని ప్రకటనలతో చంపేవాళ్లు. జర్నలిస్టుగా చేరిన తొలి రోజుల్లో బడ్జెట్ వార్తలు రాయడం ఒక స్పెషల్ ఫీట్. అప్పుడప్పుడు టెక్నాలజీ బాగా వీక్. అప్పుడప్పుడే గ్యాలీలో అక్షరాలు పేర్చుకునే కాలం దాటి కంప్యూటర్ ప్రింటింగ్లోకి అడుగు పెట్టారు. యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా (UNI) పీటీఐ సంస్థల నుంచి […]