Swetha
రాజాసాబ్ చూస్తే కానీ ప్రభాస్ అభిమానుల ఆకలి చల్లారేలా లేదు. ఇక ఇది అయినవెంటనే స్పిరిట్ , ఫౌజీ లాంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన అప్డేట్స్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమా మీద దర్శకుడు అంచనాలను పెంచేస్తున్నాడు.

రాజాసాబ్ చూస్తే కానీ ప్రభాస్ అభిమానుల ఆకలి చల్లారేలా లేదు. ఇక ఇది అయినవెంటనే స్పిరిట్ , ఫౌజీ లాంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా కొత్త సినిమాలకు సంబందించిన అప్డేట్స్ వచ్చేసాయి. అయితే ఇప్పుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న ఫౌజీ సినిమా మీద దర్శకుడు అంచనాలను పెంచేస్తున్నాడు. సీతారామం లాంటి ఓ మ్యాజికల్ లవ్ స్టోరీ తీసిన తర్వాత ఇప్పుడు ఫౌజీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు హను.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అలాగే ఈసినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది. దీనితో సినిమా మీద అంచనాలు ఇంకాస్త పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు సినిమాను సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా అవుట్ పుట్ వలన డార్లింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా కొత్తగా చూపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్.
మరీ ముఖ్యంగా మూవీ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయట. అలాగే సాంగ్స్ కూడా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించేలా ఉన్నాయట. సో మొత్తానికి ఫౌజీ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతారనేది తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్ లో ఇది మరో మైలు రాయిగా మారబోతుందని అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీ షూటింగ్ జరుగుతుందంట. ఆ తర్వాత షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.