The Girlfriend Movie Review In Telugu: రష్మిక మొదటి సారి విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. ఈ సినిమా అనౌన్సుమెంట్ దగ్గరనుంచి ప్రమోషనల్ కంటెంట్ వచ్చే వరకు కూడా ప్రేక్షకులలో ఆసక్తి అలానే ఉంది. పైగా రాహుల్ రవీంద్రన్ లాంటి డైరెక్టర్. సో సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ట్రైలర్ కట్ కూడా అంతే అద్భుతంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
The Girlfriend Movie Review In Telugu: రష్మిక మొదటి సారి విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. ఈ సినిమా అనౌన్సుమెంట్ దగ్గరనుంచి ప్రమోషనల్ కంటెంట్ వచ్చే వరకు కూడా ప్రేక్షకులలో ఆసక్తి అలానే ఉంది. పైగా రాహుల్ రవీంద్రన్ లాంటి డైరెక్టర్. సో సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ట్రైలర్ కట్ కూడా అంతే అద్భుతంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
Swetha
రష్మిక మొదటి సారి విమెన్ సెంట్రిక్ మూవీ చేసింది. ఈ సినిమా అనౌన్సుమెంట్ దగ్గరనుంచి ప్రమోషనల్ కంటెంట్ వచ్చే వరకు కూడా ప్రేక్షకులలో ఆసక్తి అలానే ఉంది. పైగా రాహుల్ రవీంద్రన్ లాంటి డైరెక్టర్. సో సినిమా మీద అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ట్రైలర్ కట్ కూడా అంతే అద్భుతంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూసేద్దాం.
కథ :
విజయవాడలో పుట్టి పెరిగిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి రష్మిక. తల్లి లేని పిల్ల కావడంతో ఆమె తండ్రి రావు రమేష్ గారాబంగా పెంచుకుంటాడు. పై చదువుల కోసం హైదరాబాద్ కు వస్తుంది. ఆమె ద్యాస అంతా కూడా చదువు మీదే పెడుతుంది. ఆమెను మొదటి చూపులో ప్రేమిస్తాడు విక్రమ్. మెల్ల మెల్లగా ఆమె కూడా అతనిని ప్రేమలో పడుతుంది. కొంతకాలం అంతా బాగానే ఉన్నా ఆ తర్వాత విక్రమ్ లోని మరొక యాంగిల్ బయటకు వస్తుంది. వీరి విషయం రావు రమేష్ కు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? విక్రమ్ రష్మిక ల ప్రేమ కథ ఏమైంది ? ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ కు సినిమా కథకు సంబంధం ఏంటి ? అనేవి తెలియాలంటే వెండితెర మీద సినిమా చూడాల్సిందే.
నటీ నటులు , టెక్నీకల్ టీం పనితీరు :
ముందుగా నటీ నటుల విషయానికొస్తే ఇక్కడ చెప్పుకోవాల్సింది రష్మిక గురించే. ఇప్పటివరకు చాలా సినిమాలలో తన నటనతో అందరిని మెప్పించి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీతో మరో మెట్టు ఎక్కేసింది. స్టార్ట్ టు ఎండ్ రష్మిక స్క్రీన్ ప్రెజెన్స్ అందరిని మెస్మరైజ్ చేసిందని చెప్పి తీరాల్సిందే. ఇక దీక్షిత్ శెట్టి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యారెక్టర్ మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో తన క్యారెక్టర్ లో జీవించాడు దీక్షిత్. వీరి తర్వాత రావు రమేష్ , రోహిణి లాంటి మెయిన్ క్యారెక్టర్స్ అంతా కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాహుల్ రవీంద్రన్ కూడా ఓ చిన్న క్యారెక్టర్ లో నటించి సర్ప్రైజ్ చేసాడు.
ఇక టెక్నీకల్ టీం విషయానికొస్తే.. ఇక్కడ ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ గురించే. సినిమా స్టార్ట్ టు ఎండ్ ఒక ట్రాన్స్ లో ఉండడానికి రీజన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ. సినిమాటోగ్రాఫి కూడా అదిరిపోయింది. అలాగే రాహుల్ రవీంద్రన్ తన రాసుకున్న కథను ఎలా అయితే చెప్పాలని అనుకున్నాడో.. సరిగ్గా అదే విధంగా స్క్రీన్ మీద చూపించాడు. రన్ టైం విషయంలో కూడా ఎక్కడా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకున్నాడు.
విశ్లేషణ :
ఇది కూడా అన్ని ప్రేమ కథల్లా ఓ కథ అని అనిపించుకోకుండా.. సినిమాలో ఎదో ఉందిరా అనే ఫీలింగ్ కలిగిస్తుంది. అసలు ఇప్పుడున్న ఈ జెన్ జి యుగంలో రిలేషన్ షిప్స్ అనేవి సీరియస్ గా ఉండడం లేదు. ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో ఎందుకు బ్రేక్ అప్ అంటారో ఎవరికీ అర్థంకాదు. ఎందుకు అలా జరుగుతుంది అని ఆలోచించే తీరిక కూడా ఎవరికీ ఉండదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఓ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడిన ఓ అమ్మాయి.. , తన జీవితం, తన ఆశయం కోసం ఎలా ముందుకు వెళ్ళింది అనేది రాహుల్ రవీంద్రన్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించాడు.
ఓ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే సినిమాలో చాలా సెన్స్ ఉందని అందరికి అనిపించడం ఖాయం. అలాగే ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా.. ఇద్దరిలో ఒకరు ఇలా టాక్సిక్ గా బెహేవ్ చేయడం కామన్ అయిపోయింది. కానీ సినిమా అంతా కూడా అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది కాబట్టి.. కథ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అక్కడక్కడా కొన్ని లాజిక్స్ మిస్ అయినా మాట నిజమే కానీ.. ఓ ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు అవి పెద్దగా పట్టించుకోరు జనాలు. అలాగే కొన్ని సీన్స్ కన్విన్సింగ్ గా అనిపించవు. కానీ ఈ కథను అమ్మాయిలు ఇష్టపడతారు.. అబ్బాయిలలో కొంతమంది మెచ్చుకుంటారు. ఓవరాల్ గా రాహుల్ రవీంద్రన్ యూత్ ను మెప్పించి సక్సెస్ అయ్యాడు
ప్లస్ లు :
రష్మిక , దీక్షిత్ శెట్టి
స్క్రీన్ ప్లే
ఎమోషన్స్
మైనస్ లు :
కొన్ని సీన్స్ లాజిక్ మిస్ అవ్వడం
ఇంట్రో సీన్స్ (కొన్ని)
రేటింగ్ : 2.75/5
చివరిగా : ది గర్ల్ ఫ్రెండ్ ను యూత్ చూడాల్సిందే