iDreamPost
android-app
ios-app

స్పిరిట్ లో రానా దగ్గుబాటి తమ్ముడు

  • Published Nov 06, 2025 | 12:14 PM Updated Updated Nov 06, 2025 | 12:14 PM

డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పటికే అందరికి కంఠస్థం అయిపోయి ఉంటుంది. ఈ సినిమాలు కంప్లీట్ కాకముందే సిక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు ప్రభాస్. వీటి అన్నిటిలో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. రాజాసాబ్ కనుక సక్సెస్ అయితే సిక్వెల్ ఉంటుందని ఆల్రెడీ టాక్ వచ్చేసింది.

డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పటికే అందరికి కంఠస్థం అయిపోయి ఉంటుంది. ఈ సినిమాలు కంప్లీట్ కాకముందే సిక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు ప్రభాస్. వీటి అన్నిటిలో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. రాజాసాబ్ కనుక సక్సెస్ అయితే సిక్వెల్ ఉంటుందని ఆల్రెడీ టాక్ వచ్చేసింది.

  • Published Nov 06, 2025 | 12:14 PMUpdated Nov 06, 2025 | 12:14 PM
స్పిరిట్ లో రానా దగ్గుబాటి తమ్ముడు

డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పటికే అందరికి కంఠస్థం అయిపోయి ఉంటుంది. ఈ సినిమాలు కంప్లీట్ కాకముందే సిక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడు ప్రభాస్. వీటి అన్నిటిలో రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమా రాజాసాబ్. రాజాసాబ్ కనుక సక్సెస్ అయితే సిక్వెల్ ఉంటుందని ఆల్రెడీ టాక్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత మోస్ట్ హైప్ ఉన్న సినిమా ఏదైనా ఉందంటే అది సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమానే. మొన్నీమధ్యనే దాని నుంచి ఓ డిఫరెంట్ అప్డేట్ వచ్చింది. వీడియో లేకపోయినా ఉన్నా ఆడియోకే ప్రభాస్ అభిమానులు థ్రిల్ ఫీల్ అయ్యారు.

ఇక ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి , ప్రకాశ్‌ రాజ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కాంచన లాంటి వాళ్ళు కీ రోల్స్ పోషిస్తున్నారు. అలాగే కొరియన్ యాక్టర్ డాన్ లీ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు రీసెంట్ గా కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ మూవీలో రానా తమ్ముడు అభిరామ్ కూడా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫుల్ యాటిట్యూడ్ ఉన్న రోల్ కు అభిరామ్ ను సెలెక్ట్ చేశారట. అహింస సినిమాతో వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిరామ్.

అసలు ఈ సినిమా ఎప్పుడొచ్చిందో, ఎప్పుడెళ్లిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. కానీ అతని యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు రెండో సినిమాకే స్పిరిట్ లాంటి భారీ మూవీలో ఎంపిక అవ్వడం సాధారణ విషయం కాదు. ముందు ముందు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.