Swetha
కిరణ్ అబ్బవరం కు దీపావళి టైమింగ్ బాగా కలిసివస్తుంది. గత సంవత్సరం దీపావళికి 'క' ఇక ఈసారి 'కె ర్యాంప్'. దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది

కిరణ్ అబ్బవరం కు దీపావళి టైమింగ్ బాగా కలిసివస్తుంది. గత సంవత్సరం దీపావళికి ‘క’ ఇక ఈసారి ‘కె ర్యాంప్’. దర్శకుడు జైన్స్ నాని తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే సాయికుమార్ ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ . అల్లరి చిల్లరిగా తిరిగే కిరణ్ అబ్బవరం అతని కొడుకు. తన కొడుకుకి చదువు అబ్బడం లేదని కేరళలోని ఓ కాలేజ్ లో జాయిన్ చేస్తాడు సాయికుమార్. అక్కడ మొదటి చూపులోనే యుక్తి తరేజా తో ప్రేమలో పడతాడు కిరణ్. అక్కడినుంచి అసలు కథ మొదలవుతుంది. ఆమెకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దానికి వలన కిరణ్ ఇబ్బందుల్లో పడతాడు ? చివరికి కిరణ్ తన నాన్న గురించి తెలుసుకున్న విషయాలు ఏంటి ? ఆమె సమస్యకు కిరణ్ పరిష్కారం చూపించాడా లేదా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు.. ఓటిటిలో అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. నవంబర్ 15 నుంచి సినిమా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.