iDreamPost
android-app
ios-app

షూటింగ్ కంప్లీట్ కాకముందే కోట్లు తెచ్చిపెట్టిన కాంచన 4

  • Published Nov 06, 2025 | 10:25 AM Updated Updated Nov 06, 2025 | 10:25 AM

రాఘవ లారెన్స్ ఓ పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న టైం లోనే యాక్టర్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు. అలా వచ్చిన ఫ్రాంచైజ్ ఏ కాంచన. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. అయితే కాంచన 3 వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ పార్ట్ రావడానికి చాలా ఆలస్యం అయింది.

  • Published Nov 06, 2025 | 10:25 AMUpdated Nov 06, 2025 | 10:25 AM
షూటింగ్ కంప్లీట్ కాకముందే కోట్లు తెచ్చిపెట్టిన కాంచన 4

రాఘవ లారెన్స్ ఓ పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న టైం లోనే యాక్టర్ గా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసాడు. అలా వచ్చిన ఫ్రాంచైజ్ ఏ కాంచన. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. అయితే కాంచన 3 వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ పార్ట్ రావడానికి చాలా ఆలస్యం అయింది. కొన్ని నెలల క్రిందట కాంచన 4 ని మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే.. ‘కాంచన-4’కు ఒక రేంజిలో బిజినెస్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అన్ని లాంగ్వేజ్స్ లో కలిపి డిజిటల్ రైట్స్ రూ.50 కోట్లు వరకు డీల్ కుదిరిందట. అలాగే హిందీ రైట్స్ రూ.50 కోట్లకు పైగానే పలికాయని ఇన్సైడ్ టాక్. అప్పట్లో కాంచన సిరీస్‌లో వచ్చిన సినిమాను హిందీలో డబ్బింగ్ చేస్తే.. అదిరిపోయూయి రెస్పాన్స్ వచ్చింది. అక్షయ్ కుమార్ చేసిన రీమేక్ కంటే కూడా లారెన్స్ చేసిన ఒరిజినల్ వెర్షన్ నే ఎక్కువ మంది చూశారు.

సో ఈసారి కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా రావడానికి ఇంకా చాలానే సమయం ఉంది. కానీ అప్పుడే కోట్లు తెచ్చిపెడుతుందంటే ఈ ఫ్రాంచైజ్ కు ఉన్న డిమాండ్ ఏంటో అర్థమైపోతుంది. ఇక ఈసారి కాంచన 4 లో పూజా హెగ్డే, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారట. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.. థియేట్రికల్ రైట్స్ ఎలా అమ్ముడుపోతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.