Swetha
మైకేల్ జాక్సన్.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే చాలా మంది ఉప్పొంగిపోయేవారు. ఇప్పుడంటే ఎంతో మంది సింగర్స్ డ్యాన్సర్స్ వస్తూ ఉన్నారు కానీ. నాలుగు దశాబ్దాల క్రితం మైకేల్ జాక్సన్ ఒక్కడే. టీనేజ్ లోనే తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసాడు. ఆ సమయంలో ఎవరికీ సాధ్యం కానీ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకున్నాడు

మైకేల్ జాక్సన్.. ఒకప్పుడు ఈ పేరు వింటేనే చాలా మంది ఉప్పొంగిపోయేవారు. ఇప్పుడంటే ఎంతో మంది సింగర్స్ డ్యాన్సర్స్ వస్తూ ఉన్నారు కానీ. నాలుగు దశాబ్దాల క్రితం మైకేల్ జాక్సన్ ఒక్కడే. టీనేజ్ లోనే తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసాడు. ఆ సమయంలో ఎవరికీ సాధ్యం కానీ ఫాలోయింగ్ ను తన సొంతం చేసుకున్నాడు. సింగర్‌గా, డ్యాన్సర్‌గా, మ్యుజీషియన్‌గా ఎన్నో ఆల్బమ్స్ కు ప్రాణం పోసాడు. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ లెజెండరీ పర్సన్ మీద ఓ బయోపిక్ ను తీయబోతున్నారనే టాక్ అందరిలో జోష్ తీసుకొచ్చింది.
దానికి సంబందించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. 2009లో 51 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ను శోక సంద్రంలో ముంచేశాడు. ఆ తర్వాత అతని మీద ‘దిస్ ఈజ్ ఇట్’ అనే ఓ డాక్యుమెటరీని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు అతని జీవితంలో జరిగిన అన్ని విషయాలను బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘మైకేల్’ పేరుతో ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రాన్ని రూపొందించాడు. 2026 ఏప్రిల్ 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైకేల్‌ను ఇష్టపడే ప్రతి అభిమానికీ ఇది ఒక గొప్ప మెమరీ గా మారడం ఖాయం. ముందు ముందు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.