Idream media
Idream media
బడ్జెట్ ఇదో బ్రహ్మపదార్థం. ఆర్థిక నిపుణులకు మినహా సాధారణ పౌరులకు అర్థం కాదు. ఏ రంగానికి ఎంత కేటాయించారనే లెక్కలు తప్పా.. మరే విషయాలు పెద్దగా అర్థం కావు. ఇక మరో బ్రహ్మపదార్థం.. జీడీపీ. వీటన్నింటిపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు, పెట్టిన తర్వాత చర్చ సాగుతుంది. అయితే ప్రతి సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికారపార్టీ బడ్జెట్‌కు అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తాయి. ఒకే వాక్యంతో ఉండే రాజకీయ నేతల వ్యాఖ్యలు వినేందుకు సరదాగా ఉంటాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాజకీయ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. సరదాగా అనిపించే ఒకే వాక్యం గల ఆ వ్యాఖ్యలు ఏమిటో ఒక సారి చూద్దాం..
ప్రతిపక్ష పార్టీల నేతలు..
– సమాన్యుడి నడ్డి విరిచిన బడ్జెట్
– బడ్జెట్ చప్పగా ఉంది
– బడ్జెట్ నిస్తారంగా ఉంది
– పేలవమైన బడ్జెట్
– రైతు వ్యతిరేక బడ్జెట్
– నిరుద్యోగుల ప్రస్తావనే లేని బడ్జెట్
– విదేశీ సంస్థలకు అనుకూల బడ్జెట్
– కార్పొరేట్ బడ్జెట్
– మధ్యతరగతిని విస్మరించిన బడ్జెట్
– విజన్ లేని బడ్జెట్
– పెట్టుబడిదారుల బడ్జెట్
– గందరగోళ బడ్జెట్
అధికార పార్టీ.. మద్దతు పార్టీలు..
– మునుప్నెడూ చూడని బడ్జెట్
– రైతు సంక్షేమ బడ్జెట్
– బృహత్తర బడ్జెట్
– సామాన్యుడి కలల బడ్జెట్
– మధ్యతరగతి బడ్జెట్
– మోదీ మార్క్ బడ్జెట్
– ప్రజానుకూల బడ్జెట్
– బంగారు బడ్జెట్
– అందరి బడ్జెట్
– పేదరిక నిర్మూలణా బడ్జెట్
– బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం
– బ్రహ్మాడమైన బడ్జెట్