iDreamPost
android-app
ios-app

ఈసారి కూడా సుధీర్ బాబు అంచనాలు తప్పాయా !

  • Published Nov 08, 2025 | 3:10 PM Updated Updated Nov 08, 2025 | 3:10 PM

అందరి హీరోలకు తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. కానీ వారు మాత్రం ప్రతి సినిమాకు తమను తాము అందంగా మలుచుకుంటూనే ఉంటారు. చాలా కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి హీరోలలు సుదీర్ బాబు కూడా ఒకరు. సుధీర్ బాబు ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు

అందరి హీరోలకు తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. కానీ వారు మాత్రం ప్రతి సినిమాకు తమను తాము అందంగా మలుచుకుంటూనే ఉంటారు. చాలా కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి హీరోలలు సుదీర్ బాబు కూడా ఒకరు. సుధీర్ బాబు ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు

  • Published Nov 08, 2025 | 3:10 PMUpdated Nov 08, 2025 | 3:10 PM
ఈసారి కూడా సుధీర్ బాబు అంచనాలు తప్పాయా !

అందరి హీరోలకు తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. కానీ వారు మాత్రం ప్రతి సినిమాకు తమను తాము అందంగా మలుచుకుంటూనే ఉంటారు. చాలా కష్టపడి సినిమాలు చేస్తూ ఉంటారు. అలాంటి హీరోలలు సుదీర్ బాబు కూడా ఒకరు. సుధీర్ బాబు ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత కష్టపడినా కూడా లక్ కూడా కలిసి రావాలి. సుదీర్ బాబు విషయంలో ఇదే జరిగింది. ఇక రీసెంట్ గా జటాధరా మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు నెగటివ్ టాక్, రివ్యూస్ వస్తున్నాయి. హర్రర్ డివోషనల్ మిక్స్ చేసి చెప్పాలనే ఇంటెన్షన్ బానే ఉంది కానీ టేకింగ్ లో ఎక్కడో లోపం ఉన్నట్లు అర్ధమౌతుంది. విఎఫెక్స్ క్వాలిటీ, స్క్రీన్ ప్లే సమస్య, కొన్ని సీన్స్ ప్లేసెమెంట్స్ ఇవన్నీ ప్రేక్షకులను అప్సెట్ చేసాయి. ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ బాగానే క్లిక్ అవుతుంది. కార్తికేయ 2, కాంతార, మిరాయ్, కల్కి లాంటివి వందల కోట్లు వసూలు చేశాయి కూడా. అలా అని వరల్డ్ బిల్డింగ్ పేరుతో ముందే రెండు భాగాలు అనేసుకుని.. సరైన ప్లేస్మెంట్స్ లేకుండా తీస్తే ఇలానే అవుతాయని జటాధరా చెప్పకనే చెప్పింది.

ఇక్కడ హీరోలకు డిజాస్టర్స్ రావడం కొత్త కాదు కానీ.. వరుసగా వస్తే మాత్రం ఆ హీరోలకు రిస్క్ ఉన్నట్లే. ఇక ఇప్పుడు సుదీర్ బాబు అంచనాలు తప్పాయి. ఇకనైనా ఈ హీరో జాగ్రత్తపడతాడేమో చూడాలి. ఇక కొన్నేళ్లలో తన వారసుడిని కూడా తీసుకురావాలని చూస్తున్నారు. మరి ఈలోపు సుదీర్ బాబు ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ అయినా పడుతుందేమో అని చూస్తున్నారు ఆడియన్స్. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.