Swetha
ఈ వారం థియేటర్లో ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వచ్చేసింది. చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో.
ఈ వారం థియేటర్లో ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వచ్చేసింది. చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో.
Swetha
ఈ వారం థియేటర్లో ఓ నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సినిమా రష్మిక ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాకు యునానిమస్ హిట్ టాక్ వచ్చేసింది. చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా ప్రీ వెడ్డింగ్ షో. ఈ సినిమాకు రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు టీం. ఇక్కడే ఆ సినిమా కంటెంట్ మీద వారికి ఎంత నమ్మకం ఉంది అనేది అర్థమైపోతుంది.
అయితే రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ పరంగా ఈ సినిమా కాస్త వెనుకబడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా వచ్చినట్టు చాలా మందికి తెలియదు. దీనితో కొన్ని చోట్ల చాలా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న కారణంగా కొన్ని మల్టీప్లెక్సులు షోలు క్యాన్సిల్ చేసేసారు. ఇప్పుడున్న సిట్యుయేషన్స్ లో మార్కెటింగ్ అనేది చాలా అవసరం. కానీ ప్రీ వెడ్డింగ్ షో టీం ఇలాంటి బలమైన స్ట్రాటజీ ఫాలో అవ్వలేదు. సరే ఇప్పటికి మించిపోయింది ఏమి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ బాగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఛాన్స్ ను వాడుకుంటే ప్రీ వెడ్డింగ్ షో కి అన్నీ ప్లస్ లే
ప్రేక్షకులు కూడా ఏ సినిమాను ఎక్కడ చూడాలి అనే కంక్లూజన్ కు వచ్చేస్తున్నారు. సో వాళ్లంతా థియేటర్లో ఈ సినిమాను చూడాలి అంటే మాత్రం.. కనీసం ఇప్పుడైనా టీం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తే బెటర్ అని అంతా అనుకుంటున్నారు. వీలైతే సెలెబ్రిటీల సహాయం తీసుకుని సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయిస్తే.. ఈ వీకెండ్ ఆక్యుపెన్సీలు పెరుగుతాయని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.