Swetha
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా చేసిన మూవీ మిత్రమండలి. జాతిరత్నాలు టైప్ లో ఈ సినిమా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఊహించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయింది ఈ మూవీ. దీపావళి కానుకగా ఓ రోజు ముందే ప్రీమియర్స్ రూపంలో రావడంతో అసలు మ్యాటర్ అక్కడే తేలిపోయింది.
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా చేసిన మూవీ మిత్రమండలి. జాతిరత్నాలు టైప్ లో ఈ సినిమా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఊహించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయింది ఈ మూవీ. దీపావళి కానుకగా ఓ రోజు ముందే ప్రీమియర్స్ రూపంలో రావడంతో అసలు మ్యాటర్ అక్కడే తేలిపోయింది.
Swetha
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా చేసిన మూవీ మిత్రమండలి. జాతిరత్నాలు టైప్ లో ఈ సినిమా ఉంటుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఊహించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేయలేకపోయింది ఈ మూవీ. దీపావళి కానుకగా ఓ రోజు ముందే ప్రీమియర్స్ రూపంలో రావడంతో అసలు మ్యాటర్ అక్కడే తేలిపోయింది. అయితే థియేటర్లో ఎలా ఉన్నా ఓటిటి లో మాత్రం కొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ డేట్ లాక్ అయింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. జంగ్లీపట్నానికి చెందిన వీటీవీ గణేశ్‌కు క్యాస్ట్ పిచ్చి బాగా ఎక్కువ. ఆ ఏరియా ఎం.ఎల్. సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటాడు.ఇక కులాంతర వివాహాలైతే అస్సలు ఒప్పుకోడు. ఓసారి నారాయణ కూతురు నిహారిక ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయ్యిందని.. వెన్నెల కిషోర్ తో కలిసి డ్రామా ఆడటం మొదలుపెడతాడు. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ద్వారా స్వేచ్ఛ మిస్సింగ్ వెనుక నలుగురు మిత్రులు ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓ.ఐ, ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నలుగురిలో ఒకరికోసం నిహారిక బయటకు వచ్చిందా ? ఆమె వలన మిగిలిన వారు ఎలాంటి ఇబ్బందులు పడతారు ? చివరికి ఏమైంది ? అనేదే కథ .
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. మూవీ రిలీజ్ అయినా 20 రోజుల్లోనే అంటే నవంబర్ 6 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందట. కాబట్టి థియేటర్లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.