జేమ్స్ క్యామరూన్ కలల దృశ్యకావ్యం అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కోరుకున్న లక్ష్యం దిశగా పరుగులు పెడుతోంది. 2022 వరల్డ్ వైడ్ టాప్ గ్రాసర్ గా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 21 రోజులకు 1516 బిలియన్ డాలర్లు వసూలు చేసి ఔరా అనిపించింది. మన కరెన్సీలో 12 వేల 505 కోట్లు. నిన్నటి దాకా ఈ ప్లేస్ లో టాప్ గన్ మావారిక్ ఉండగా అవతార్ దాన్ని సులభంగా అది కూడా తక్కువ టైంలో […]
భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలైన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మొదటి వారం కనిపించిన దూకుడు తర్వాత తగ్గినప్పటికీ ఇటీవలే వచ్చిన వాటిలో ఒక్క ధమాకా మాత్రమే మాస్ ఆడియన్స్ మెప్పు పొందటంతో మరోసారి ఈ విజువల్ వండర్ కి ఛాన్స్ దొరికింది. ముఖ్యంగా వీకెండ్ కలెక్షన్లు భారీగా ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అవతార్ 2 మొత్తం పన్నెండు రోజులకు గాను 1 బిలియన్ డాలర్లను […]
మూడు రోజులుగా అవతార్ ది వే అఫ్ వాటర్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. పోటీగా ఒక్క సినిమా లేకపోవడాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటోంది. ముఖ్యంగా త్రిడిలో అద్భుతమైన అనుభూతినిస్తోందనే టాక్ బాగా వెళ్లిపోవడంతో వీకెండ్ మూడు రోజులు థియేటర్లు జనాలతో కళకళలాడాయి. ఒక్క ఇండియా నుంచే సుమారు 160 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ముంబై రిపోర్ట్. తెలుగు రాష్ట్రాలు విడిగా చూసుకుంటే 37 కోట్లకు పైగా వసూలయ్యాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఏ మధ్యతరహా హీరోకి […]
మాములుగా ఒక హాలీవుడ్ సినిమాకు తెల్లవారుఝామున ఆరు గంటలకు షోలు పడటం తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదు. ఏ మహేష్ బాబో పవన్ కల్యాణో అయితే సహజం అనుకోవచ్చు. కానీ అవతార్ 2కి పట్టణాల్లో సైతం స్పెషల్ ప్రీమియర్లు వేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. మొదటి భాగం వచ్చిన పదమూడేళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ అయినప్పటికీ జనంలో దీని క్రేజ్ ఇంకా తగ్గలేదనే క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ల […]
దేశం మొత్తం సినిమాలు ఎక్కువగా చూసేది ఎవరయ్యా అంటే దక్షిణాది ప్రేక్షకులని చెప్పడానికి మరో చక్కని ఉదాహరణ అవతార్ 2కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రంగా నార్త్ ఆడియన్స్ అవతార్ 2 మీద ఏమంత ఆసక్తి చూపించడం […]
గత శుక్రవారం చేపల మార్కెట్ ని తలపించేలా ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేసిన చిన్న సినిమాలు ఏవీ కమర్షియల్ పరంగా చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోయాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ముఖచిత్రం, పంచతంత్రం లాంటివి ప్రత్యేకంగా అనిపించినా వాతావరణ పరిస్థితుల వల్ల జనం పెద్దగా థియేటర్లకు రాలేకపోయారు. ఇప్పుడు డిసెంబర్ 16 రానుంది. అవతార్ 2కు భయపడి చెప్పుకోదగ్గ రిలీజులేవి ప్లాన్ చేయలేదు. శాసనసభ అనే మల్టీ లాంగ్వేజ్ మూవీ ఒకటి వస్తోంది కానీ దాని మీద ఏమంత […]
ప్రపంచ మూవీ లవర్స్ లో అధిక శాతం ఎదురు చూస్తున్న సినిమాగా అవతార్ 2 మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనూ భారీ వసూళ్లను ఆశిస్తున్న డిస్నీ కనీసం ఆరు నుంచి ఏడు వందల కోట్ల దాకా టార్గెట్ పెట్టుకుంది. ఇది కొంచెం ఓవర్ గా అనిపిస్తున్నా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అదేమీ అసాధ్యం కాదన్నది ట్రేడ్ టాక్. ఈ విజువల్ గ్రాండియర్ ఫైనల్ రన్ టైం 3 గంటల 12 […]
నిన్న చాలా సినిమాలు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది. పేరుకి పదికి పైగానే విడుదలైనా జనాల దృష్టి పడిన వాటిలో ముఖచిత్రం ముందువరసలో ఉండగా పంచతంత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని నమ్ముకుని వీకెండ్ మీద ఆశలు పెట్టుకుంది. సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం పికపయ్యే సూచనలు కనిపించడం లేదు. పబ్లిసిటీ లోపం వల్ల విజయానంద్ ప్రేక్షకుల దాకా వెళ్లలేకపోయింది. లెహరాయి లాంటి వాటిని ఎవరూ పట్టించుకోలేదు. గత వారం రిలీజై నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ […]
2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ ‘అవతార్’కు సీక్వెల్గా వస్తున్న మూవీకి ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water ). ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది. ఊహించటానికి వీల్లేని విజువలైజేషన్ తో, అద్భుతమైన గ్రాఫిక్స్తో చిన్న,పెద్దా తేడా లేకుండా అందిరనీ ఆకట్టుకున్న చిత్రం ‘అవతార్’. ఇప్పుడీ మూవీ సీక్వెల్ వస్తున్న సంగతి […]
ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ అవతార్ 2 ఇంకో నలభై ఆరు రోజుల్లో బిగ్ స్క్రీన్ పై అడుగు పెట్టనుంది. కనివిని ఎరుగని ఓపెనింగ్స్ ని ట్రేడ్ అంచనా వేస్తోంది. యుఎస్ లాంటి దేశాల్లోనే కాదు ఇండియాలోనూ దీని హైప్ మాములుగా లేదు. ఎంతగా అంటే ఒక్క ఏపీ తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ నుంచే సదరు నిర్మాణ సంస్థ జస్ట్ 100 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తోందట. మాములుగా ఇది చాలా పెద్ద మొత్తం. […]