iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో అవతార్, KGF సీక్వెల్స్ ని దాటేసిన జైలర్!

  • Author ajaykrishna Published - 11:18 AM, Tue - 8 August 23
  • Author ajaykrishna Published - 11:18 AM, Tue - 8 August 23
ఆ విషయంలో అవతార్, KGF సీక్వెల్స్ ని దాటేసిన జైలర్!

ఇండస్ట్రీలో సినిమాల స్టాండర్డ్ లతో పాటు టెక్నికల్ వాల్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు అన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అన్నివిధాలా సినిమాలు ఒకదానికి ఒకటి పోటీగా నిలవడమో లేక ఆల్రెడీ సెట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయడమో జరుగుతుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మాసీవ్ యాక్షన్ ఫిల్మ్ ‘జైలర్’ అదే పనిలో ఉన్నట్లుంది. ఆగష్టు 10న రజినీ నటించిన జైలర్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. రజినీ సినిమా అంటే.. తమిళ, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషలలో కూడా రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సాంగ్స్, ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ముఖ్యంగా ట్రైలర్ చూశాక చాలా ఎక్సయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. కాగా.. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో.. స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, మోహన్ లాల్, తమన్నా, రమ్యకృష్ణ కీలకపాత్రలలో నటించారు. అయితే.. సినిమా రిలీజ్ కి దగ్గరపడటంతో ఎక్స్ పెక్టేషన్స్ కూడా పెరుగుతూ పోతున్నాయి. ఈ క్రమంలో జైలర్ మూవీ.. కర్ణాటకలోని బెంగుళూరు సిటీలో మాసీవ్ రికార్డును కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. మరి ఆ రికార్డు ఏంటనే వివరాల్లోకి వెళ్తే..

ఇప్పటిదాకా బెంగుళూరు సిటీలో అవతార్ 2, కేజీఎఫ్ 2 సినిమాలకు రికార్డు స్థాయిలో షోస్ లభించాయి. హైయెస్ట్ షోస్ పరంగా చూసుకుంటే.. కేజీఎఫ్ 2కి 1037 షోలు, అవతార్ 2 కి 1014 షోలు నమోదు చేశాయి. ఫస్ట్ టైమ్ ఈ రెండు సినిమాలను బీట్ చేస్తూ.. జైలర్ మూవీ మొదటి స్థానంలో దూసుకుపోనుంది. తాజా సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ సినిమాకి ఏకంగా 1093 షోస్ ప్రస్తుతానికి కేటాయించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అక్కడ ఇన్నాళ్లు ఉన్న బిగ్గెస్ట్ రికార్డును జైలర్ తో రజినీ తన ఖాతాలో వేసుకున్నారని అంటున్నారు. ఇదంతా రజినీ స్టామినాకి ఉదాహరణ అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి జైలర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom