iDreamPost
android-app
ios-app

అవతార్ 2 బిజినెస్ – మరీ ఇంత క్రేజా..!

అవతార్ 2 బిజినెస్ – మరీ ఇంత క్రేజా..!

ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ అవతార్ 2 ఇంకో నలభై ఆరు రోజుల్లో బిగ్ స్క్రీన్ పై అడుగు పెట్టనుంది. కనివిని ఎరుగని ఓపెనింగ్స్ ని ట్రేడ్ అంచనా వేస్తోంది. యుఎస్ లాంటి దేశాల్లోనే కాదు ఇండియాలోనూ దీని హైప్ మాములుగా లేదు. ఎంతగా అంటే ఒక్క ఏపీ తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ నుంచే సదరు నిర్మాణ సంస్థ జస్ట్ 100 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తోందట. మాములుగా ఇది చాలా పెద్ద మొత్తం. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాటలు సైతం అంత మొత్తాన్ని రాబట్టలేకపోయాయి. అలాంటిది అసలు బిసి సెంటర్ల జనం చూస్తారా లేదానే అనుమానం ఉన్న హాలీవుడ్ సినిమాకు ఈ రేంజ్ ఆఫర్ అంటే మైండ్ బ్లాంకే.

ఇంత భారీ మొత్తాన్ని అడుగుతున్నా కూడా బయ్యర్లు కొంచెం అటుఇటుగా కొనేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. మొత్తం భారతదేశం కలిపి సుమారు 600 కోట్లకు పైగా డీల్స్ అవ్వొచ్చని అంటున్నారు. దెబ్బకు ఆ టైంలో తమ కొత్త సినిమా రిలీజులను ఎవరూ ప్లాన్ చేసుకోవడం లేదు. అవతార్ 2 కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వసూళ్ల ఊచకోత మాములుగా ఉండదు. ముఖ్యంగా వరల్డ్ బెస్ట్ త్రీడి ఎక్స్ పీరియన్స్ దీని ద్వారా పొందవచ్చని మేకర్స్ అంటున్నారు. సహజంగానే ఈ వెర్షన్ కు డిమాండ్ అధికంగా ఉంటుంది. పన్నెండేళ్ల క్రితం వచ్చిన అవతార్ 1ని ఇటీవలే రీ రిలీజ్ చేస్తే చాలా మంచి వసూళ్లు రావడం మర్చిపోకూడదు.

ఇప్పుడీ సునామి చూస్తుంటే అవతార్ 2 కనీసం నెల రోజుల దాకా బాక్సాఫీస్ ని తక కంట్రోల్ లోకి తీసుకెళ్లేలా ఉంది. ముఖ్యంగా యూత్  చిన్న పిల్లలు ఎదురుచూస్తున్న తీరు మాములుగా లేదు ఇప్పటికిప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఇంకో రెండు వారాల్లో ఆన్ లైన్ టికెటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది. జేమ్స్ క్యామరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మోషన్ క్యాచర్ విజువల్ వండర్ కు వాడిన సాంకేతికనే ఆది పురుష్ కోసమూ ఉపయోగించారు. కాకపోతే ప్రభాస్ సినిమా వాయిదా పడింది కాబట్టి పోలికలు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకుంది. మొత్తానికి అవతార్ 2 ఓ రేంజ్ లో రికార్డులు సృష్టించేలా ఉంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş