iDreamPost
android-app
ios-app

అవతార్ 2లో చాలా షాకులున్నాయి

ఇంకో యాభై రోజుల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 మీద మాములు అంచనాలు లేవు. మూవీ లవర్స్ డిసెంబర్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా థియేటర్లను సిద్ధం చేసుకుంటున్న నగరాలున్నాయి.

ఇంకో యాభై రోజుల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 మీద మాములు అంచనాలు లేవు. మూవీ లవర్స్ డిసెంబర్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా థియేటర్లను సిద్ధం చేసుకుంటున్న నగరాలున్నాయి.

అవతార్ 2లో చాలా షాకులున్నాయి

ఇంకో యాభై రోజుల్లో విడుదల కాబోతున్న అవతార్ 2 మీద మాములు అంచనాలు లేవు. మూవీ లవర్స్ డిసెంబర్ 16 ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురు చూస్తున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా థియేటర్లను సిద్ధం చేసుకుంటున్న నగరాలున్నాయి. హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ ని ఆ టైంలోగా కొత్త హంగులతో ముస్తాబు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై తదితర సిటీస్ లో అత్యధిక కౌంట్ తో ప్రదర్శించబోతున్నారు. అంతగా అవతార్ ఫీవర్ ప్రేక్షకులనే కాదు ఎగ్జిబిటర్లను సైతం పట్టేసింది. మొదటి రోజు ఇండియాలో హాలీవుడ్ మూవీస్ అన్నింటిలోకి హయ్యెస్ట్ ఓపెనింగ్ దక్కడం ఖాయమనే అంచనాలు బలంగా ఉన్నాయి.

అవతార్ వచ్చి 12 ఏళ్ళు పూర్తయ్యాయి. అప్పటి నుంచి దర్శకుడు జేమ్స్ క్యామరూన్ సీక్వెల్ మీద పని చేస్తున్నారు. ఇంకో మూడు భాగాలు సిద్ధం చేయబోతున్నారు కానీ దీని ఫలితం చాలా కీలకంగా మారనుంది. నిడివి 3 గంటల 10 నిమిషాల దాకా ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మొదటి భాగం దీనికన్నా అరగంట తక్కువగా ఉంటుంది. లెన్త్ ఎంత ఉన్నా ఆడియన్స్ ఆ మాయా ప్రపంచంలో మునిగేందుకు సిద్ధంగా ఉన్నారు. మాములుగా ఇంగ్లీష్ సినిమాలు గంటన్నర నుంచి రెండున్నర గంటలలోపే పూర్తవుతాయి. ఇదే క్యామరూన్ తీసిన టైటానిక్ మాత్రమే సుదీర్ఘమైన నిడివి ఉన్నప్పటికి ఏ మాత్రం విసిగించకుండా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన దక్కించుకుంది.

అవతార్ 2 డిసెంబర్ మూడో వారం నుంచి రిలీజ్ కాబోతున్న తెలుగు తమిళ హిందీ సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. దీనికి సరిగా వారం తర్వాత ధమాకా, 18 పేజెస్, సర్కస్ లాంటివి చాలానే వస్తున్నాయి. అవతార్ 2కి కనక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం తట్టుకోవడం కష్టమే. దీనికి నెల ముందు వస్తున్న వాకండా సైతం పెద్ద హైప్ తోనే రిలీజ్ అవుతోంది. ఇంకొద్ది రోజుల్లో అవతార్ 2కి సంబంధించిన బిజినెస్ ఫిగర్స్ రాబోతున్నాయి. అవి షాకింగ్ గా ఉంటాయని ట్రేడ్ టాక్. అసలే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న కంటెంట్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న ట్రెండ్ లో అవతార్ 2 ఏ మాత్రం బాగున్నా దాని రికార్డులకు ఆకాశమే హద్దు

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin