iDreamPost
android-app
ios-app

10 లక్షల టికెట్లలో ముప్పాతిక మనవే – సినిమా ప్రేమంటే ఇది

  • Published Dec 15, 2022 | 5:37 PM Updated Updated Dec 07, 2023 | 2:26 PM

రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

10 లక్షల టికెట్లలో ముప్పాతిక మనవే – సినిమా ప్రేమంటే ఇది

దేశం మొత్తం సినిమాలు ఎక్కువగా చూసేది ఎవరయ్యా అంటే దక్షిణాది ప్రేక్షకులని చెప్పడానికి మరో చక్కని ఉదాహరణ అవతార్ 2కి జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. రిలీజ్ కు ముందు ఇండియా వైడ్ జరిగిన జరిగిన 10 లక్షల ముందస్తు అమ్మకాల్లో నాలుగు రాష్ట్రాలు ఏపి తెలంగాణ తమిళనాడు కేరళ నుంచే 7.5 లక్షలు అమ్ముడుపోయాయంటేనే ఇక్కడ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రంగా నార్త్ ఆడియన్స్ అవతార్ 2 మీద ఏమంత ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ టాక్ బాగా వస్తే అప్పుడు వెళ్లేలా ఉన్నారు తప్పించి ఫస్ట్ డేనే చూసేయాలన్న ఆత్రం వాళ్లలో లేనట్టే ఉంది. కానీ సౌత్ లో మాత్రం సీన్ దీనికి పూర్తి రివర్స్ లో ఉంది.

తెలుగు స్టేట్స్ తో పాటు చెన్నై బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో అర్ధరాత్రి 12 నుంచి షోలు మొదలుకాబోతున్నాయి. ఓవర్సీస్ ప్రీమియర్ల నుంచి రివ్యూలు డివైడ్ గా రావడం టీమ్ ని కొంత ఖంగారు పెడుతున్నా అవన్నీ రేపటికి సర్దుకుంటాయనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. మరోవైపు పైరసీ బెడద అవతార్ 2 కు అప్పుడే మొదలైంది. పలు వెబ్ సైట్లలో కొందరు కెమెరా ప్రింట్లు పెట్టేయడంతో యూనిట్ వాటిని డిలీట్ చేయించే పనిలో ఉంది. అయినా ఇలాంటి విజువల్ ఫీస్ట్ ని పెద్ద తెర మీద చూస్తేనే మజా ఉంటుంది కానీ ఇలా అర్థం కాని సౌండ్ మధ్య అరకొర క్లారిటీతో చూస్తే పిసరంత థ్రిల్ కూడా ఉండదు. అందుకే ఇవి ఎన్ని వచ్చినా వసూళ్లకు ఇబ్బంది లేదు

తొలి వీకెండ్ అవతార్ 2కి చాలా కీలకం. ఎందుకంటే ఇక్కడ అన్ని భాషల్లో 23న చెప్పుకోదగ్గ రిలీజులు ఉన్నాయి. రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్, నయనతార కనెక్ట్, రణ్వీర్ సింగ్ సర్కస్ వరసగా థియేటర్ల మీద దాడి చేయబోతున్నాయి. ఆలోగా అవతార్ కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అధిక శాతం స్క్రీన్లు కంటిన్యూ అవుతాయి. లేదా కౌంట్ తగ్గిపోతుంది. ఇండియా వైడ్ అయిదు వందల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్న డిస్నీకి అదేమంత సులభంగా కనిపించడం లేదు. యావరేజ్ అనిపించుకున్నా కష్టమే. మొత్తానికి మన సినిమా లవ్ ముందు ఎవరైనా బలాదూరే అని ఇప్పుడీ బుకింగ్స్ రుజువు చేస్తున్నాయి. రేపు మధ్యాన్నంలోపు పూర్తి రిపోర్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి కౌంట్ డౌన్ షురూ