iDreamPost
android-app
ios-app

అవతార్ 2 మళ్ళీ వచ్చేస్తుంది…

  • Published May 23, 2025 | 10:37 AM Updated Updated May 23, 2025 | 10:37 AM

Avatar 2: కేవలం టాలీవుడ్ సినిమాలనే కాదు హాలీవుడ్ సినిమాలను కూడా రిరీలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ అవతార్ కూడా ఒకటి.

Avatar 2: కేవలం టాలీవుడ్ సినిమాలనే కాదు హాలీవుడ్ సినిమాలను కూడా రిరీలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ అవతార్ కూడా ఒకటి.

  • Published May 23, 2025 | 10:37 AMUpdated May 23, 2025 | 10:37 AM
అవతార్ 2 మళ్ళీ వచ్చేస్తుంది…

థియేటర్స్ లో ఈ మధ్య స్ట్రెయిట్ సినిమాలకంటే కూడా రీరీలీజ్ లకె ఎక్కువ క్రేజ్ లభిస్తుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలను మరోసారి తెరపై చూస్తూ ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రీరిలీజ్ కానుంది.

కేవలం టాలీవుడ్ సినిమాలనే కాదు హాలీవుడ్ సినిమాలను కూడా రిరీలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి. వాటిలో హాలీవుడ్ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ అవతార్ కూడా ఒకటి. ఈ సినిమాను జేమ్స్ కేమరూన్ తెరకెక్కించారు. ఇక అవతార్ 1 ప్రపంచ వ్యాప్తంగా మంచి నేమ్ తెచ్చుకోవడంతో కొన్నేళ్ల క్రితమే ఈ ఫ్రాంచైజ్ నుంచి 2 వ పార్ట్.. అవతార్ ది వే ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ సినిమా కూడా సంచలనం సృష్టించిందని చెప్పి తీరాల్సిందే.

ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా కూడా రిరీలీజ్ ట్రెండ్ లో భాగం కానుంది. కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఈ సినిమాను థియేటర్స్ లో రన్ చేయనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 3 నుంచి థియేటర్స్ లో రీరీలీజ్ చేయనున్నారు. సో మరోసారి వెండితెరపై ఈ సినిమాను ఎక్స్పీరియెన్స్ చేయాలి అనుకునేవారికి.. ఇది చాలా పెద్ద ట్రీట్ అని చెప్పి తీరాల్సిందే. అయితే ఈ మూవీ రీరిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందా లేదా ఓవర్సీస్ మార్కెట్ లోనే ఉంటుందా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.