iDreamPost
android-app
ios-app

అవతార్ టూ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

  • Published Dec 19, 2022 | 6:24 PM Updated Updated Dec 06, 2023 | 11:16 AM

ముఖ్యంగా త్రిడిలో అద్భుతమైన అనుభూతినిస్తోందనే టాక్ బాగా వెళ్లిపోవడంతో వీకెండ్ మూడు రోజులు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.

ముఖ్యంగా త్రిడిలో అద్భుతమైన అనుభూతినిస్తోందనే టాక్ బాగా వెళ్లిపోవడంతో వీకెండ్ మూడు రోజులు థియేటర్లు జనాలతో కళకళలాడాయి.

అవతార్ టూ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

మూడు రోజులుగా అవతార్ ది వే అఫ్ వాటర్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. పోటీగా ఒక్క సినిమా లేకపోవడాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటోంది. ముఖ్యంగా త్రిడిలో అద్భుతమైన అనుభూతినిస్తోందనే టాక్ బాగా వెళ్లిపోవడంతో వీకెండ్ మూడు రోజులు థియేటర్లు జనాలతో కళకళలాడాయి. ఒక్క ఇండియా నుంచే సుమారు 160 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ముంబై రిపోర్ట్. తెలుగు రాష్ట్రాలు విడిగా చూసుకుంటే 37 కోట్లకు పైగా వసూలయ్యాయి. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఏ మధ్యతరహా హీరోకి ఇంత ఫిగర్ రాలేదు. మల్టీప్లెక్సులు నిండుగా ఉండటం చాలా కాలం తర్వాత దీనికే జరిగింది. ప్రసాద్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ టికెట్ల కోసం ఏకంగా రికమండేషన్లు వస్తున్నాయి

ఇక లెక్కల విషయానికి వస్తే ఇది డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కుని చేసిన రిలీజ్ కాదు కాబట్టి ఒక్కో ఏరియాను బట్టి విడివిడి వివరాలు రాలేదు. నైజామ్ లో అత్యధికంగా 19 కోట్ల 60 లక్షలు, ఆంధ్రా నుంచి 12 కోట్ల 70 లక్షలు, సీడెడ్ నుంచి 4 కోట్ల 75 లక్షలు వసూలైనట్టుగా తెలిసింది. నిర్మాణ సంస్థ స్వంతంగా చేసింది కాబట్టి బయ్యర్లు కేవలం మధ్యవర్తులుగా వ్యవహరించారు. డిస్నీ చెప్పిన కండీషన్లు అధిక రేట్లకు భయపడి ఎవరూ రిస్క్ చేయలేకపోయారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటుంది. ఈ రోజు నుంచి అంటే సోమవారం సాధారణంగా కనిపించే డ్రాప్ నుంచి అవతార్ 2 సైతం తప్పించుకోలేదు. యాభై శాతం దాకా డ్రాప్ కనిపిస్తోంది
Avatar Two 3 Days Collection Report
ఈ వారం చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి అవతార్ 2 మీద వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ రవితేజ ధమాకా, నిఖిల్ 18 పేజెస్, విశాల్ లాఠీ వేటికవే డిఫరెంట్ జానర్లతో వస్తున్నాయి. సరిగా క్లిక్ అయితే వీకెండ్ మాత్రమే అవతార్ కు ఛాన్స్ ఉంటుంది. ప్రధాన కేంద్రాల్లో కలెక్షన్లు బాగున్నాయి కానీ బిసి సెంటర్లలో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ 1600 కోట్ల దాకా కలెక్ట్ చేసిన ఈ జేమ్స్ క్యామరూన్ గ్రాఫిక్స్ మాయాజాలం టార్గెట్ కు ఇంకా చాలా దూరంలో ఉంది. ఫైనల్ థియేట్రికల్ రన్ పూర్తయ్యేలోగా 16 వేల కోట్లను దాటాల్సి ఉంటుంది. కనీసం నెల రోజుల రన్ ఉంటుంది మరీ అసాధ్యమైతే కాదు