ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అవకాశం ఇచ్చారు. బెదరింపుల వల్ల నామినేషన్లు దాఖలు చేయలదని, బలవంతంగా ఉపసంహరణ చేయించారనే కారణంతో రాష్ట్రంలో 11 చోట్ల రీ నామినేషన్ వేసేందుకు అనుగుణంగా కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి కార్పొరేషన్లో ఆరు డివిజన్లు, పుంగనూరు మున్సిపాలిటీలో మూడు వార్డులు, వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో […]
పంచాయతీ ఎన్నికల అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తూ నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యలకు, టీడీపీ పార్టీ కార్యాలయంలో కూర్చుని చంద్రబాబు మాట్లాడుతున్న మాటలకు పెద్ద వ్యత్యాసం కనిపించడం లేదు. ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదంటూనే.. ఏకగ్రీవాలు మనకు అవసరం లేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికారులకు చెబుతున్నారు. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగితే అది అధికారుల వైఫల్యమేనంటూ కొత్త భాస్యం చెబుతున్నారు. నాయకత్వం […]
పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదనేలా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు అంటూ.. నూతన యాప్‌ను తీసుకొచ్చారు. పూర్తిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కనుసన్నల్లో, అత్యంత గోప్యంగా తయారు చేయించిన ఈ యాప్‌ను ఎస్ఈసీ ఈ రోజు ఆవిష్కరించింది. ఆ యాప్‌కు ఈ–వాచ్ అని పేరు పెట్టారు. యాప్ తయారీ, పని తీరు తదితర […]
రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారా..? అవుననేలా పరిణామాలు జరుగుతున్నాయి. జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రెస్మీట్లు పెడుతూ హల్చల్ చేస్తున్న నిమ్మగడ్డ వ్యవహారశైలి రాజకీయ నాయకుడుగా ఉందని ఇప్పటికే తేలింది. ఈ రోజు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించిన నిమ్మగడ్డ.. మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడు అవతారం ఎత్తారని స్పష్టమవుతోంది. వైఎస్సార్ కడప […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రిం కోర్టులో నేడు సోమవారం విచారణ జరగనుంది. ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ విడుదల చేసిన పంచాయతీ షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే విధించగా.. డివిజనల్ బెంచ్ నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రిం […]
రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎన్నికల కమిషనర్ చేయని పనిని ప్రస్తుత కమిషనర్ నిమ్మగడ్డ చేసేందుకు సిద్ధపడ్డారు. అర్హత ఉన్న ప్రతి ఓటరును తనకున్న ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం ఎన్నికల కమిషనర్ ప్రధానమైన కర్తవ్యం. ఎదుటి వారి విధులు, కర్తవ్యాలను ఎత్తిచూపుతున్న నిమ్మగడ్డ తను నెరవేర్చాల్సిన ముఖ్య కర్తవ్యానికి మట్టుకు మినహాయింపులు ఇచ్చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ అంటూ హడావిడి పడుతున్న నిమ్మగడ్డ ఏపీలోని దాదాపు మూడున్నర లక్షల మందికిపైగా ఓటర్లకు ఓటు హక్కు లేకుండానే […]
పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తన వ్యక్తిగత ఆసక్తి ఏమీ లేదని, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను మాత్రమే తాను నిర్వహిస్తున్నానంటూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాటలకు చేతలకు పొంతన కుదరడం లేదు. సహేతుకంగా ఎన్నికలను నిర్వహిస్తున్నానంటూ చెప్పిన నిమ్మగడ్డ.. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చేస్తున్న పని, తీసుకున్న నిర్ణయాలు సహేతుకమైతే.. నిమ్మలంగా కూర్చుని మీడియా అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నారనే సందేహాలు సాధారణంగానే వినిపిస్తాయి. […]
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఉత్కంఠ మరికొన్ని రోజులపాటు కొనసాగే పరస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం వాదనలను విన్న ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది తెలియాల్సి ఉంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా.. కరోనా వైరస్, వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో సాధ్యం కాదంటూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. […]
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్‌ను జారీ చేస్తూ ప్రొసీడింగ్స్, ఎన్నికల నియమావళి విధింపు, బదిలీలపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆది నుంచి నిమ్మగడ్డ వ్యవహరించిన తీరును ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ఏకపక్షంగా నవంబర్ 17వ తేదీన నిర్ణయం […]
అవిభాజ్యం రాష్ట్రంలో సైతం ఎప్పుడు అమలు కాని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏపీలో అమలవుతున్నాయి. అడిగిన వారికే కాదు, అర్హత ఉంటే అడగని వారికి కూడా పథకం వచ్చిపడుతోంది. అమ్మ ఒడి నుంచి మొదలు పెడితే చేయూత, ఇంటి స్థలం వరకు దాదాపు నవరత్నాల్లో ఎన్నో కొన్ని రత్నాలు పేదల తలుపుతడుతున్నాయి. అది కూడా గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి రావాలంటే అనేక మంది నాయకులు మొక్కాలి, వాళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని ఎదురు చూడాల్సి […]