సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతలు ఆ అనుభవంతో ప్రజలకు వివిధ అంశాలపై హితబోధ చేస్తుంటారు. పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు, సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సం రోజున పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. దేశంలోనే సీనియర్‌ను తాను అంటూ మొదలు పెట్టిన చంద్రబాబు.. కొందరు రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు పెంచే పార్టీ […]
అమరావతి చుట్టూ టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. ఆపార్టీ నేతల ఆర్థిక సామ్రాజ్యం దానితో ముడిపడి ఉండడం అందుకు ప్రధాన కారణం. అనేకమంది నాయకులు వేలకోట్ల పెట్టుబడులు పెట్టి, లక్షలకోట్ల రిటర్నుల మీద ఆశలు పెట్టుకుని అమరావతి నిర్మాణానికి పూనుకున్నట్టు కనిపిస్తుంది. దాంతో అమరావతి చుట్టూ ఏర్పడిన సందిగ్ధం తొలగిపోతే టీడీపీ కీలక నేతల ఆర్థిక ప్రయోజనాలకు ఢోకా ఉండదు. ఏకైక రాజధానిగా నిర్ణయం జరిగితే అది ఖచ్చితంగా టీడీపీలో పెత్తనం చేసే నేతలకు భారీలబ్దికి మార్గం […]
రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆసరాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని పచ్చదండు మైండ్‌గేమ్‌కు తెరతీసింది. ఇక మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదన్నట్టు, అమరావతి నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి తీరాలన్నట్టు విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. తీర్పురావడం తరువాయి అమరావతి రైతుల సంబరాలు, ఆనందోత్సాహాలు అంటూ హడావిడి చేశారు. మరోపక్క టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమై హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఇంకోపక్క రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు షరీఫ్, యనమల, ధూళిపాళ్ల, పత్తిపాటి పుల్లారావు, […]
ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో అధికారం కట్టబెట్టి యేడాది పూర్తయింది. శాసనసభలో ఆధిక్యంలో ఉన్న పార్టీ ఐదేళ్ళ పాటు అధికారంలో ఉంటుంది. ఈ ఐదేళ్ళు ఎలా పరిపాలన చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి పాలన అందిస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ పాలన, ఈ నిర్ణయాలు వారికి నచ్చితే అధికారం మరోసారి కట్టబెడతారు. నచ్చకపోతే ఓడించి మరో పార్టీకి పట్టం కడతారు. రాజధాని విభజన ప్రజలకు నచ్చకపోతే 2024 ఎన్నికల్లో వాళ్ళే తీర్పు చెపుతారు. […]
తెలుగుదేశం పాలనలో రాజధాని పేరిట సాగిన భూ కుంభకోణంలోని వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. వైసిపి మొదటి నుంచి ఆరోపిస్తునట్టుగానే రాజధాని పేరిట భారి ఏత్తున భూముల విషయంలో అవకతవకలు జరిగినట్టు తాజా పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించి సిట్ బృందం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట సాగించిన భూ దందాలోని నిజనిజాలను ఆదారాలతో సహా వేలికితీసే పనిలో ఉండగా.. తాజాగా మరో అడుగు ముందుకు వేసి పూర్తి […]
అమరావతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన సిట్ స్పీడ్ పెంచుతోంది. బాధ్యులను బయటకు లాగుతోంది. ల్యాండ్ పూలింగ్ స్కామ్ బండారం బయటపెడుతోంది. ఆక్రమంలో పలువురు రెవెన్యూ అధికారుల పాత్రను గుర్తించింది. ఇప్పటికే ఒక డిప్యూటీ కలెక్టర్ ని అరెస్ట్ చేసింది. తాజాగా మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు, ఆరుగురు తహశీల్దార్ల పాత్రపై కూడా కీలక అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో నివసిస్తున్న ఓ రెవెన్యూ అధికారి ల్యాండ్ ఫూలింగ్ పథకంలో పెద్ద […]
రాజధాని అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో దర్యాప్తు చేస్తున్న ’సిట్’ దూకుడు పెంచింది. చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం పేరుతో సుమారు 34 వేల ఎకరాలు భూసమీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు 4700 ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. భూ సమీకరణ సందర్భంగా టిడిపిలో కీలక నేతలు, చంద్రబాబు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇన్ సైడర్ […]
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధాని పేరిట జరిగిన భూ కుంభకోణంపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే రాజధాని పేరిట జరిగిన అక్రమాలను సిట్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. తాజాగా ఈ భూకుంభకోణంలో మొదటిసారిగా ఓ అధికారిని సిట్ బృందం అరెస్టు చేసింది. ఆంద్రప్రదేశ్ సి.ఆర్.డి.ఏ డిప్యుటి కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన మాధురీని విజయవాడలోని తన నివాసంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని అనంతరం రిమాండుకు తరలించారు. 2016లో రాజధాని ప్రాంతంలో […]
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను క్రమంగా అమలు చేసేందుకు పూనుకుంటున్నారు. పాలనా సంస్కరణలతో పలు మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్, తాజాగా రాజధానుల విషయంలో కూడా స్పష్టతకు వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల అంశంలో ప్రభుత్వం ముందడుగు వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖలో సెక్రటేరియేట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాటికి అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు సడలింపుల తర్వాత మళ్లీ […]
రెండు నెలల తర్వాత ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి స్వరాష్ట్రానికి వచ్చారు. కాన్వాయ్‌తో రాష్ట్ర సరిహద్దుల్లో అడుగుపెట్టగానే టీడీపీ శ్రేణులు భారీగా జాతీయ రహదారిపైకి వచ్చి స్వాగతం పలికాయి. రోడ్డుపై టీడీపీ జెండాలతో వేచి ఉన్న టీడీపీ శ్రేణులను చూడగానే చంద్రబాబు కారును ఆపారు. డోర్‌పై నిలబడి తనదైన శైలిలో అభివాదం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. టీడీపీ కార్యకర్తలు తనకు స్వాగతం పలకడంతో బాబు […]