iDreamPost
android-app
ios-app

అమరావతి ప్రాంత పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

అమరావతి ప్రాంత పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. అలానే పేదలకు ఇళ్లు, వైద్యం, విద్యా అందేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేద ప్రజలకు టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల్లో ఇళ్లను అందిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో కూడా సమన్యాయం ఉండేలా పేదలకు కూడా ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చే చర్యలు తీసుకున్నారు.  ఈ ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన.. వాటిని చేధిస్తూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్లింది. తాజాగా సోమవారం సమావేశమై సీఆర్‌డీఏ పరిధిలో 47 వేలకుపైగా పేదల గృహాలను మంజురు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

న్యాయస్థానాల్లో పోరాటం చేసి సీఆర్‌డీఏ పరిధిలోని పేదలకు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఆ ఇళ్లు మంజూరు చేయవద్దని ప్రతిపక్షానికి చెందిన కొందరు నాయకులు కేంద్రానికి లేఖలు రాశారు. అయినప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కృషితో సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు 47 వేలకుపైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ సోమవారం సమావేశమై పేదల గృహాలను మంజురు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ వెల్లడించారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ..” న్యాయస్థానాల్లో కేసులున్నాయని, సీఆర్‌డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు మంజూరు చేయవద్దని కొందరు కేంద్రానికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశ అజెండాలో ఈ ఇళ్ల మంజూరు ఉంటుందా ఉండదా? అనే అనుమానాలు కూడా కలిగాయి. ఎటువంటి కోర్టు కేసులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సఫలమైంది. దీంతో సోమవారం జరిగిన సమావేశంలో సీఆర్‌డీఏ పరిధిలోని 47 వేలకుపైగా పేదల ఇళ్లను మంజూరు చేసింది” అని అజయ్ జైన్ తెలిపారు. ఇంకా మూడువేల ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతులు రావాలని, వాటికి కూడా త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు సీఆర్‌డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏ పేదల కోసం చట్టసవరణ కూడా చేసి, కోర్టులో పోరాటం చేసి.. వారి అనుమతితోనే సీఆర్‌డీఏ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేసింది. ఈనేపథ్యంలోనే గత నెల 26వ తేదీన సీఎం జగన్ సీఆర్‌డీఏ పరిధిలోని 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మరి.. అమరావతి ప్రాంత పేద ప్రజల విషయంలో సీఎం జగన్ చేస్తున్న కృషిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.