iDreamPost
android-app
ios-app

తారక్ అభిమానుల ఆశలన్నీ అతనిపైనే !

  • Published Aug 19, 2025 | 10:38 AM Updated Updated Aug 19, 2025 | 10:38 AM

సరిగ్గా పదేళ్ల క్రితం తారక్ వరుస ప్లాపులతో చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఒక్క హిట్ పడినా చాలు అని ఎదురుచూసిన రోజులు అవి. తారక్ తో పాటు తారక్ అభిమానులు కూడా అలానే ఎదురుచూశారు. అలాంటి టఫ్ సిట్యువేషన్లో టెంపర్ రూపంలో పూరి జగన్నాథ్ అతనికి హిట్ అందించాడు. తారక్ కూడా ఆ హిట్ తర్వాత అభిమానులకు ప్రామిస్ చేసాడు.

సరిగ్గా పదేళ్ల క్రితం తారక్ వరుస ప్లాపులతో చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఒక్క హిట్ పడినా చాలు అని ఎదురుచూసిన రోజులు అవి. తారక్ తో పాటు తారక్ అభిమానులు కూడా అలానే ఎదురుచూశారు. అలాంటి టఫ్ సిట్యువేషన్లో టెంపర్ రూపంలో పూరి జగన్నాథ్ అతనికి హిట్ అందించాడు. తారక్ కూడా ఆ హిట్ తర్వాత అభిమానులకు ప్రామిస్ చేసాడు.

  • Published Aug 19, 2025 | 10:38 AMUpdated Aug 19, 2025 | 10:38 AM
తారక్ అభిమానుల ఆశలన్నీ అతనిపైనే !

సరిగ్గా పదేళ్ల క్రితం తారక్ వరుస ప్లాపులతో చాలా ఇబ్బందులు ఎదురుకున్నాడు. ఒక్క హిట్ పడినా చాలు అని ఎదురుచూసిన రోజులు అవి. తారక్ తో పాటు తారక్ అభిమానులు కూడా అలానే ఎదురుచూశారు. అలాంటి టఫ్ సిట్యువేషన్లో టెంపర్ రూపంలో పూరి జగన్నాథ్ అతనికి హిట్ అందించాడు. తారక్ కూడా ఆ హిట్ తర్వాత అభిమానులకు ప్రామిస్ చేసాడు. ఇక నుంచి అభిమానులు తలెత్తుకునే సినిమాలే చేస్తాను అని చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా ఆ తర్వాత వచ్చిన పదేళ్లు కూడా తారక్ జర్నీలో ఒక్క రిమార్క్ కూడా పడలేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చే సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుందని అందరు కంగారు పడ్డారు. కానీ రాజమౌళి మిత్ ను సైతం బ్రేక్ చేసి దేవరతో విజయం అందుకున్నాడు.

అంతా చాలా బాగా సాగిపోయింది.. స్ట్రెయిట్ గా బాలీవుడ్ లో సైతం తారక్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడని వార్ 2 తో అనౌన్స్ చేయడంతో… అభిమానుల సంతోషానికి అవధులు లేవు. వార్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో సైతం ఎన్టీఆర్ రెండు కాలర్లు ఎగరేయడంతో ఇంకాస్త నమ్మకంగా థియేటర్స్ కు వెళ్లారు ప్రేక్షకులు. తీరా సినిమా రిలీజ్ తర్వాత మాత్రం వారి ఆశలు నీరు కారిపోయినట్టు అయిపోయాయి. ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో తెలియనిది కాదు. పదేళ్ల పాటు సక్సెస్ ట్రాక్ లో ఉన్న తారక్ కెరీర్ కు వార్ 2 బ్రేక్ వేసింది. ఇండస్ట్రీలో వరుస విజయాలు ఎవరి తరం కాదు. ఎక్కడో ఓసారి ఎప్పుడో ఓ అప్పుడు ఇలాంటి ఫెల్యూర్స్ కూడా తగులుతూనే ఉంటాయి.

దీనితో ఇప్పుడు తారక్ అభిమానుల కళ్లన్నీ అతని మీదకు షిఫ్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ లానే అప్పట్లో ప్రభాస్ కూడా ఆదిపురుష్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి డిజాస్టర్ అనిపించుకున్నాడు. అదే హీరోకి సలార్ రూపంతో హిట్ అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇప్పుడు తారక్ కు కూడా అలాంటి ఓ సక్సెస్ నే అందిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సో ఈ సినిమా మీద దర్శకుడి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అంతా. ప్రశాంత్ నీల్ సినిమా అంటే మినిమమ్ మాస్ కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ. సో ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.