iDreamPost
android-app
ios-app

పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి.. ఆ తల్లికి నరకం చూపించారు! వీళ్ళేం మనుషులు?

  • Published Jun 03, 2024 | 12:15 PM Updated Updated Jun 03, 2024 | 12:15 PM

Krishna District Crime News: నేటి ఆధునిక కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా కూడా మన దేశంలో ఆడపిల్లలు అంటే ఇప్పటికీ చులకన భావమే.. ఈ వివక్ష ఏళ్ల కాలం నుంచి వస్తుంది.

Krishna District Crime News: నేటి ఆధునిక కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అయినా కూడా మన దేశంలో ఆడపిల్లలు అంటే ఇప్పటికీ చులకన భావమే.. ఈ వివక్ష ఏళ్ల కాలం నుంచి వస్తుంది.

  • Published Jun 03, 2024 | 12:15 PMUpdated Jun 03, 2024 | 12:15 PM
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి.. ఆ తల్లికి  నరకం చూపించారు!  వీళ్ళేం మనుషులు?

భారత దేశంలో ఒకప్పుడు మహిళలను దేవతల్లా చూసేవారు.. కానీ ఇప్పుడు ఒంటరిగా మహిళలు బయటకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. దేవంలో నిత్యం ఎక్కడో అక్కడ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు, అత్యాచారాలు.. హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల అంటే వివక్షత కొనసాగుతూనే ఉంది. మొదటి కాన్పు ఆడపిల్ల అంటే ఒకే.. రెండో కాన్పు ఆడపిల్ల అంటే భరించలేకపోతున్నారు. స్కానింగ్ చేస్తే ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్ చేసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు. తమకు వారసుడు కావాలని అత్తింటి వారు వేధిస్తూ వచ్చారు.. దీంతో ఆ వివాహిత తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. యనమలకుదురుకు చెదిన ఎర్రపోతు కావశ్రీ (19) కి.. ఎన్టీఆర్ జిల్లా కండ్రికి చెందిన సందు శ్రీకాంత్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. శ్రీకాంత్ పాతపాడు సచివాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ జంటకు పది నెలల కూతురు ఉంది. కావ్యక్ష ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. ఈ మధ్యనే శ్రీకాంత్.. కావ్యశ్రీని వెంటబెట్టుకొని విజయవాడకు వెళ్లి ఓ హాస్పిటల్ లో స్కానింగ్ చేయించాడు. ఆ స్కానింగ్ లో ఆమె కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తేలింది. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవ మొదలైంది. అత్తింటి వారి నుంచి వేధింపులు పెరిగిపోయాయి.. తమకు వారసుడు కావాలని వెంటనే అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోయింది కావ్యశ్రీ. రెండు సార్లు ఆమెను బలవంతంగా అబార్షన్ చేయించడానికి ఆస్పత్రికి తీసుకువెళ్లార.. కానీ కావ్యశ్రీ అందుకు నిరాకరించింది. అప్పటి నుంచి అత్తింటి వేధింపులు పరాకాష్టకు చేరుకోవడంతో పుట్టింటికి వచ్చేసింది. గత నెల 31వ తేదీన భర్త ఈమె వద్దకు వచ్చాడు. ఈ క్రమంలోనే కావశ్రీ భర్తతో బాత్ రూమ్ కి వెళ్తున్నా అని చెప్పి వెళ్లింది. ఎంత సేపటికీ కావ్యశ్రీ బయటకు రాకపోవడంతో భర్త, ఆమె తల్లిదండ్రులు బాత్ రూమ్ తపులు పగలగొట్టి చూడగా ఆమె వెంటిలేటర్ రాడ్ కి చున్నీతో ఉరెసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే విజయవాడ పటమట లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తమ కుమార్తెను భర్త, అత్తింటి వారు అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేయడం వల్లనే మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పపడిందని ఆమె తండ్రి ఎర్రబోతు రాజ ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో భర్త, అత్తమామలపై కేసు నమోదు చేశారు పోలీసులు.