Swetha
అఖండ 2 ఈ సినిమా గురించి కొద్దీ రోజుల నుంచి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా ఎపుడు రిలీజ్ అవుతుంది ఏంటి అంతా సందేహంలో ఉన్నారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు.దీనితో అప్పట్లోనే సినిమాకి సిక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు.

అఖండ 2 ఈ సినిమా గురించి కొద్దీ రోజుల నుంచి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సినిమా ఎపుడు రిలీజ్ అవుతుంది ఏంటి అంతా సందేహంలో ఉన్నారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు.దీనితో అప్పట్లోనే సినిమాకి సిక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. దీనితో ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అని అంతా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25నఈ సినిమా రిలీజ్ ఉంటుందని ముందు అనౌన్స్ చేశారు. అయితే ప్రీప్రొడక్షన్ , విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయంటూ.. సెప్టెంబర్ 25 కాకుండ సినిమా డిసెంబర్ కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ ఇప్పటికి అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ అటు బోయపాటి బాలకృష్ణ మాత్రం ఆ సినిమాని సెప్టెంబర్ 25 కి కచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ ప్రైమ్ , నెట్ ఫ్లిక్స్ కంటే కూడా జియో హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. రిలీజ్ విషయంలో మాత్రం టైం దగ్గర పడిన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చేలా ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.