Swetha
మంచు విష్ణు సకుటుంబ సపరివార సమేతంగా నటించిన మూవీ కన్నప్ప. ఇది మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్. అలాగే సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల లాంటి భారీ తారాగణం నటించారు. దీనితో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మంచు విష్ణు సకుటుంబ సపరివార సమేతంగా నటించిన మూవీ కన్నప్ప. ఇది మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్. అలాగే సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల లాంటి భారీ తారాగణం నటించారు. దీనితో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Swetha
మంచు విష్ణు సకుటుంబ సపరివార సమేతంగా నటించిన మూవీ కన్నప్ప. ఇది మంచు ఫ్యామిలీ డ్రీం ప్రాజెక్ట్. అలాగే సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల లాంటి భారీ తారాగణం నటించారు. దీనితో సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే రిలీజ్ ముందు వరకు కూడా విష్ణు ఈ సినిమాను జనాల్లోకి తీసుకుని వచ్చేందుకు.. చాలా ప్రయత్నాలు చేసాడు. ఎన్నో ఇంటర్వూస్ , ఈవెంట్స్ తో ఎంత ప్రమోట్ చేయాలో అంతా చేశాడు.
అలా బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జూన్ 27న థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకునేలోపు మంచి టాక్ నే సంపాదించుకుంది. అయితే రిలీజ్ కు ముందు నుంచి కూడా మూవీ ఓటిటి డీల్ విషయంలో జరిగిన మ్యాటర్ తెలియనిది కాదు. ఈ మధ్య కాలంలో దాదాపు చాలా సినిమాలు రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ ను క్లోజ్ చేసుకుంటే.. విష్ణు మాత్రం ఓటిటి రైట్స్ అమ్మలేదు. ఇక సినిమా రిలీజ్ తర్వాత మంచి ధరలకు ఓటిటి డీల్ క్లోజ్ అయినా విషయం తెలిసిందే.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్ లో సినిమా రిలీజ్ అయిన ఏడు నుంచి ఎనిమిది వారాల తర్వాత మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. కానీ ఇది పది వారాలైనా రాకపోవడంతో.. థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. సెప్టెంబర్ 5న ఓటీటీలోకి విడుదల చేయనున్నారని టాక్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.