iDreamPost
android-app
ios-app

సమంతకు ఇంత గ్యాప్ రావడం వెనుక కథేంటి ?

  • Published Aug 21, 2025 | 3:48 PM Updated Updated Aug 21, 2025 | 3:48 PM

సమంతకు ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్ లో నడించింది. కానీ సమంతను ఫుల్ ప్లెడ్జెడ్ గా తెర మీద చూసి రెండేళ్లు గడిచిపోయింది. ఆఖరిగా సమంత నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదన్న మాట తెలియనిది కాదు. రీసెంట్ గా శుభం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది.

సమంతకు ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్ లో నడించింది. కానీ సమంతను ఫుల్ ప్లెడ్జెడ్ గా తెర మీద చూసి రెండేళ్లు గడిచిపోయింది. ఆఖరిగా సమంత నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదన్న మాట తెలియనిది కాదు. రీసెంట్ గా శుభం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది.

  • Published Aug 21, 2025 | 3:48 PMUpdated Aug 21, 2025 | 3:48 PM
సమంతకు ఇంత గ్యాప్ రావడం వెనుక కథేంటి ?

సమంతకు ఒకప్పుడు ఫుల్ క్రేజ్ ఉండేది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్ లో నడించింది. కానీ సమంతను ఫుల్ ప్లెడ్జెడ్ గా తెర మీద చూసి రెండేళ్లు గడిచిపోయింది. ఆఖరిగా సమంత నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా కూడా పెద్దగా హిట్ అవ్వలేదన్న మాట తెలియనిది కాదు. రీసెంట్ గా శుభం సినిమాలో గెస్ట్ రోల్ లో నటించింది. అదే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది కూడా. అయితే సినిమాలకు ఇంత గ్యాప్ తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి అనే విషయంలో రీసెంట్ గా సామ్ స్పదించింది. గ్రాజియా ఇండియా అనే ఫ్యాషన్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి చెప్పుకొచ్చింది.

గ్యాప్ రావడానికి గల కారణం.. ఆరోగ్యం మీద ఎక్కువ ద్రుష్టి పెట్టడం వలనే అని. సంవత్సరానికి ఐదు సినిమాలు తీయడం కంటే కూడా అందరికి గుర్తిండిపోయే పాత్రలు చేయడం ముఖ్యమని చెప్పుకొచ్చింది.. అలాగే వీటితో పాటు సామాజిక సేవ గురించి కూడా ప్రస్తావించింది సామ్. అయితే సమంత ప్రస్తుతం రక్తబ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. రాజ్ అండ్ డికె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ప్రకటించి చాలా నెలలే అయింది కానీ ఏవో కారణాల వలన షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని టాక్. ఈ సిరీస్ కు రెండు వలన కోట్లకు పైగానే బడ్జెట్ ను కేటాయించారట. ఇక తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతానికి సామ్ కు ఈ రెండు తప్ప వేరే ఏ కమిట్మెంట్స్ లేవు. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. కానీ దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఎదో ఓ రూపంలో ఈ మధ్య మీడియాలో అయితే యాక్టివ్ గానే ఉంటుంది సామ్. మరి ముందు ముందు తెలుగులో కూడా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి. సామ్ ఫ్యాన్స్ అయితే తన రీఎంట్రీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.