Swetha
ఒకప్పటి హీరోలు, విలన్లు అందరూ కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అందులోను జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో రోల్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ లోనే జగపతి బాబు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు జగపతి బాబు డేట్స్ కావాలంటే దర్శక నిర్మాతలు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒకప్పటి హీరోలు, విలన్లు అందరూ కూడా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అందులోను జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో రోల్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ లోనే జగపతి బాబు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు జగపతి బాబు డేట్స్ కావాలంటే దర్శక నిర్మాతలు ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగస్థలం , నాన్నకు ప్రేమతో లాంటి ఎన్నో సినిమాలు ఆయనకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాయి. అయితే ఈ మధ్య జగపతిబాబు సరిగ్గా సినిమాలలో కనిపించడం లేదన్న మాట వాస్తవం.
దానికి వెనుక ఉండే కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. జగపతి బాబు మాత్రం ఇప్పుడు సరికొత్త క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అది మరేదో కాదు బుల్లితెరమీద యాంకర్ రూపంలో దర్శనం ఇస్తున్నాడు. జీ తెలుగు ఛానెల్ వారు జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త టాక్ షో ని ప్రారంభించారు. కొంతమంది సెలెబ్రిటలను తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ , ప్రొఫెషనల్ ముచ్చట్లను పంచుకునే కార్యక్రమం ఇది. ఇదే షో కి జగపతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
ఇది కొత్త కాన్సెప్ట్ ఏమి కాదు.. చాలా మంది సెలెబ్రిటీలు ఇలాంటి షోస్ ట్రై చేసిన వాళ్ళే. అయితే జీ తెలుగులో వస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షో కి మూలం మాత్రం ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఇదే ఛానెల్ లో వచ్చిన వీకెండ్ విత్ రమేష్ ప్రోగ్రాం. అప్పట్లో ఎంతో మంది శాండిల్ వుడ్ స్టార్స్ ఈ షో లో అలరించారు. ఇక ఇప్పటికే ఈ షో కి వచ్చిన నాగార్జున ఎపిసోడ్ బాగా హిట్ అయింది. ముందు ముందు ఇంకా ఎలాంటి గెస్ట్స్ వస్తారో చూడాలి. మొత్తానికి జగపతి బాబు థర్డ్ ఇన్నింగ్స్ లో సరికొత్త రూట్ ను ఎంచుకున్నారు. ఇక షో ని ఎలా ముందుకు తీసుకుని వెళ్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.